Black Cat stuck on pole: ఎలా ఎక్కిందో తెలియదు కానీ... ఓ బ్లాక్ క్యాట్ 36 అడుగుల ఎత్తున్న స్తంభం పైకి చేరింది. దాని టాప్‌పై ఉన్న కొద్దిపాటి స్పేస్‌లో అలా కూర్చుండిపోయింది. ఎక్కడమైతే ఎక్కింది కానీ కిందకు దూకేందుకు దానికి ధైర్యం చాలనట్లుంది. రెండు రోజులు గడిచినా... అది అక్కడి నుంచి కిందకు దిగలేదు. పైనుంచి మంచు కురుస్తుండటంతో.. ఆ గడ్డ కట్టే చలిలో పిల్లికి ఏమవుతుందోనని దాని యజమాని, స్థానికులు ఆందోళన చెందారు. చివరకు స్థానిక ఫైర్ సిబ్బంది ఎట్టకేలకు ఆ పిల్లిని సురక్షితంగా కిందకు దింపగలిగారు. అమెరికాలోని (America) కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరంలోని అరోరా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆ బ్లాక్ క్యాట్ (Black Cat) పేరు పాంథర్. అలెక్సి సోబెరనీ, కింబర్లీ మెదీనా అనే వ్యక్తులు దాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల ఇంటి నుంచి తప్పిపోయిన పాంథర్ అరోరా ప్రాంతంలోని 36 అడుగుల ఓ స్తంభంపై ప్రత్యక్షమైంది. చుట్టుపక్కలవారి ద్వారా పాంథర్ యజమానులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఇద్దరు అక్కడికి పరిగెత్తుకెళ్లారు. రెండు రోజులుగా అది స్తంభం పైనే ఉందని స్థానికులు వారితో చెప్పారు. అప్పటికే వారు దాన్ని కిందకు దింపేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ... అవేవీ సఫలం కాలేదు.
చాలామంది రకరకాల ఆహార పదార్థాలు పెట్టి దాన్ని కిందకు దింపే ప్రయత్నం చేశారు. పైనుంచి మంచు కూడా కురుస్తుండటంతో ఆ బ్లాక్ క్యాట్‌కి ఏమవుతుందోనని దాని యజమానులు, స్థానికులు ఆందోళన చెందారు. అది బిక్కుబిక్కుమంటూ అక్కడే కూర్చొంది కానీ కిందకు దిగే ధైర్యం చేయట్లేదు. చివరకు విషయం అరోరా కౌన్సిల్ మెంబర్ దాకా వెళ్లింది. దీంతో వెంటనే ఆయన స్థానిక ఫైర్ సిబ్బందిని అక్కడికి పంపించారు.
ఫైర్ సిబ్బంది పెద్ద నిచ్చెన సాయంతో ఆ స్తంభంపై ఉన్న బ్లాక్ క్యాట్ పాంథర్‌ను (Viral news) కిందకు దింపగలిగారు. దీంతో దాని యజమానులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు రోజులుగా దానికి ఏమవుతుందోనని ఆందోళన చెందామని చెప్పారు. ఇప్పటివరకూ తమ పాంథర్‌ను ఫ్రీగా వదిలేశామని... ఇకనుంచి బయటకు అనుమతించేది లేదని... దాని యజమాని కింబర్లీ పేర్కొనడం గమనార్హం.
Also Read: Rahul Gandhi: హిందుత్వకు,హిందూయిజంకు తేడా అదే-బీజేపీపై రాహుల్ ఎటాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook