Groom thrashed by Bride family: ఇంకా పెళ్లే కాలేదు... అప్పుడే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశాడో నవ వరుడు... తీరా పెళ్లి ముంగింట్లో అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే లేదని తెగేసి చెప్పాడు... దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన వధువు కుటుంబ సభ్యులు వరుడిని చితకబాదారు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘజియాబాద్‌లోని (Ghaziabad) షాహిబాబాద్‌లో ఉన్న ఓ హోటల్లో శుక్రవారం (డిసెంబర్ 17) ఓ వివాహ వేడుక (Wedding ceremony) జరగాల్సి ఉంది. వధువు, వరుడు, ఇరువురి కుటుంబ సభ్యులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. తీరా పెళ్లి సమయానికి పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కావాలని పట్టుబట్టారు. అప్పటికప్పుడు రూ.10లక్షలు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని... లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగారు.
వధువు కుటుంబ సభ్యులు వరుడు, అతని కుటుంబానికి ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో కోపోద్రిక్తులైన వధువు కుటుంబ సభ్యులు వరుడిపై దాడికి దిగారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. దాడి నుంచి కాపాడేందుకు వరుడికి రక్షణగా ఓ మహిళ అతనికి అడ్డు నిలవడం వీడియోలో గమనించవచ్చు.
ఘటనపై వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పెళ్లికి (Marriage) ముందే వరుడికి రూ.3లక్షలు నగదు, రూ.1లక్ష విలువ చేసే డైమండ్ రింగ్ ఇచ్చినట్లు చెప్పారు. తీరా పెళ్లి సమయానికి అతిథుల ముందు అదనపు కట్నం కోసం పేచీ పెట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే గొడవ జరిగి ఘర్షణకు దారితీసిందన్నారు. ఆ వరుడికి ఇంతకుముందు రెండు, మూడు పెళ్లిళ్లయ్యాన్న విషయం కూడా తెలిసిందన్నారు.
In a shocking incident reported from #Sahibabad area of #Ghaziabad district in #UttarPradesh, a man, who was said to be #groom, was thrashed for allegedly demanding more #dowry. #viral #viralvdoz #video #Trending pic.twitter.com/kdL3SPb3Ej
— ViralVdoz (@viralvdoz) December 19, 2021
Also Read: P.T. Usha: రియల్ ఎస్టేట్ వివాదం: పీటీ ఉషపై చీటింగ్ కేసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook