Bollywood Movies: కరోనా సంక్షోభం సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తోంది. అయినా కొన్ని సినిమాలు విజయం దిశగా దూసుకుపోగా..కొన్ని సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచాయి. 2021లో అత్యధికంగా నిరాశకు గురి చేసిన టాప్ 5 సినిమాలేంటో చూద్దాం.
కరోనా మహమ్మారి కారణంగా మొత్తం ప్రపంచమంతా సినీ పరిశ్రమకు దెబ్బ తగిలింది. కరోనా సంక్షేభాన్ని ఎదుర్కొని మరీ మెగా హిట్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో భారీ అంచనాలతో విడుదలై మెగా డిజాస్టర్ మూవీలుగా నిలిచిన టాప్ 5 సినిమాలు ఇవీ. కొన్ని అంచనాలకు అనుగుణంగా ఆకర్షించలేక చతికిలపడితే..మరికొన్ని ఇతర కారణాలతో విఫలమయ్యాయి.
బాలీవుడ్లో భారీ డిజాస్టర్ మూవీల్లో(Bollywood Disaster Movies)ఒకటి కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ సినిమా రాథే. ప్రభుదేవా కొరియోగ్రఫీలో విడుదలైన ఈ సినిమా..అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ఈ చిత్రంలో దిశా పటానీ, జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా తదితురులు నటించారు. ఐఎండీబీ కేవలం 1.8 మాత్రం రేటింగ్ ఇచ్చింది ఈ సినిమాకు. ఇక మరో మోస్ట్ ఎవైటెడ్ మూవీ హంగామా 2. 2003లో విడుదలైన హంగామా(Hungama)సినిమాకు సీక్వెల్ ఇది. హంగామా మొదటి పార్ట్ ఐఎండీబీలో 7.6 రేటింగ్ సాధిస్తే...హంగామా 2 మాత్రం కేవలం 2.1కు పరిమితమైంది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి నటించిన ఈ కామెడీ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది.
ఇక మరో రొమాంటిక్ థ్రిల్లర్ లాహోర్ కాన్ఫిడెన్షియల్, జీ5(Zee5)నిర్మించిన ఈ సినిమాలో రిచా చద్దా, అరుదోదయ్ సింగ్, కరిష్మా, ఖలీద్ సిద్ధీఖీ నటించారు. గూఢచర్యం, థ్రిల్లింగ్ అంశాల్లో సినిమా టేకింగ్ బాగున్నప్పటికీ ఎందుకో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ఐఎండీబీ ఇచ్చిన రేటింగ్ కేవలం 2.8 మాత్రమే. ఇక బాలీవుడ్(Bollywood)హీరో రాజ్ కుమార్ రావు నటించిన కామెడీ కమ్ హర్రర్ మూవీ రూహి. హార్ధిక్ మెరతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్, వరుణ్ శర్మ నటించారు. ఈ చిత్రం కూడా బాగా నిరాశపర్చింది. అయితే ఐఎండీబీ మాత్రం 4.3 వరకూ రేటింగ్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాపై అంచనాలు భారీగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. 2016లో హాలీవుడ్ హిట్ మూవీ సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. పరిణితి చోప్రా, అదితిరావు హైదరీ నటించిన ఈ చిత్రానికి ఐఎండీబీ(IMDB Rating) 4.4 రేటింగ్ ఇచ్చింది.
Also read: F3 release date: నవ్వుల పండుగ వేసవిలో అట, ఎఫ్ 3 మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook