Farm Laws: గత ఏడాది తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు వివాదాస్పదమవడంతో.. కేంద్రం వెనక్కి తగ్గి గత నెలలోనే వాటిని (Farm laws repeal) ఉపసంహరించుకుంది. అయితే ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామని ప్రకటించారు.
తోమర్ ఇంకా ఏమన్నారంటే..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర సింగ్ తోమర్ సాగు చట్టాల గురించి (New farm laws) ప్రస్తావించారు. గత 70 ఏళ్లలో ఎవరూ చేయలేని పనిని మోదీ చేశారని చెప్పారు.
అయితే అది కొంత మందికి నచ్చలేదని (Narendra Singh Tomar on Farm Laws) విమర్శించారు. ఈ సంస్కరణలు నచ్చని కొంత మందే వాటిని నల్ల చట్టాలుగా ప్రచారం చేశారని ఆరోపించారు. ఆ కారణంగానే సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. అయితే స్వల్ప మార్పులు చేసి సాగు చట్టాలను మళ్లీ తెస్తామని మాత్రం స్పష్టం (Farm laws will back) చేశారు.
సాగు చట్టాల వివాదం..
వ్యాసాయ రంగంలో భారీ మార్పులు తెచ్చే ఉద్దేశంతో గత ఏడాది మూడు నూతన సాగు చట్టాలను తెచ్చింది (Farm laws news) కేంద్రం. ఈ చట్టాలపై రైతు సంఘాలు భగ్గుమన్నాయి. కార్పొరేట్లకు మేలు చేసేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించాయి.
ఈ కారణంగా సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలన రైతులు ఢిల్లీ సరిహద్దు వద్ద ఆందోళనలు చేపట్టారు. దాదాపు ఏడాది కాలం పాటు ఢిల్లీ సరిహద్దు వద్ద గుడారాలు ఏర్పాటు చేసుకుని నిరసనలు (Farm laws Farmers agitation) తెలిపారు. పలు మార్లు ఈ ఆందోళనలు హింసకు దారి తీశాయి కూడా.
ఈ పరిణామాలన్నింటిని నేపథ్యంలో గత నెలలో సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా (PM Modi on Farm Laws) ప్రకటించారు. చెప్పిట్లుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందుకు ఉభయ సభలు ఆమోదం తెలపడం.. రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. ఇంతటితో వివాదం ముగిసిందని అనుకుంటుండగా.. తోమర్ మరోసారి సాగు చట్టాలను తెస్తామని ప్రకటించడం గమనార్హం.
Also read: Thief Fires Bike: చలి మంట కాగేందుకు.. ఏకంగా బైక్‌నే తగలబెట్టిన దొంగ!!
Also read: Ban On Celebrations: క్రిస్మస్ , కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన రాష్ట్రాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook