దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్

            

Last Updated : Oct 18, 2017, 03:06 PM IST
దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీపావళి పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. వైట్ హౌస్ ప్రాంతంలోని ఒవల్ కార్యాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన భారత అమెరికన్‌ పరిపాలక సభ్యులతో కలిసి దీపాలను వెలిగించారు. ఈ వేడుకల్లో ఐక్యారాజసమితి అమెరికా రాయబారి నిక్కీ హేలీ, యూఎస్‌ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ పాయ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోను ట్రంప్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు.

" ఇండో -అమెరికన్‌ కమ్యూనిటీతో కలిసి దీపావళి వేడుకల్లో పాలుపంచుకోవడం మాకు గర్వకారణం.  ప్రపంచ దేశాలలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన మేటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు భారతీయులు. భారత ప్రధాని మోడీతో ఉన్న స్నేహాన్ని నేను గౌరవిస్తాను.  ఇండో-అమెరికన్‌ సోదరులు అమెరికా ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడి సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు నా కృతజ్ఞతలు. పీపుల్స్‌ హౌస్‌లో దీపావళి జరుపుకోవడం ఒక గొప్ప అనుభూతి, అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు" అని సందేశమిచ్చారు ట్రంప్. 

Trending News