Rishi Dhawan Fire Himachal Pradesh lifft Maiden Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ( Vijay Hazare Trophy)2021ని హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మాజీ ఛాంపియన్ తమిళనాడు (Tamil Nadu)తో జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) 11 పరుగుల తేడాతో గెలుపొంది. లక్ష్య ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ 47.3 ఓవర్లలో 299/4తో ఉన్న సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిపివేయబడింది. దాంతో విజేడీ (VJD) పద్ధతిలో అంపైర్లు హిమాచల్ ప్రదేశ్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో విజయ్ హజారే ట్రోఫీని హిమాచల్ ప్రదేశ్ తొలిసారి ఖాతాలో వేసుకుంది. తమిళనాడు బ్యాటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) మెరుపు సెంచరీ వృధా అయింది. సెంచరీతో జట్టును ఆదుకున్న హిమాచల్ ప్రదేశ్ వికెట్ కీపర్ శుభమ్ అరోరా (Shubham Arora)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ఏఈ మ్యాచులో టాస్ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు అపరాజిత్ (2), జగదీశన్ (9), సాయి కిషోర్ (18), ఎం అశ్విన్(7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఫోర్లు, సిక్సులతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. డీకేకి ఇంద్రజిత్ (80) అండగా నిలిచాడు. షారుఖ్ ఖాన్ 21 బంతుల్లోనే 42 పరుగులు చేయడంతో తమిళనాడు స్కోర్ 300 దాటింది. 49.4 ఓవర్లలో తమిళనాడు 314 పరుగులకు ఆలౌట్ అయింది. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Also Read: Allu Arjun: మేమంతా ఒకటే.. మా మధ్య విభేదాలా! ఒకే ఒక్క ఫోటోతో రూమర్లకు చెక్ పెట్టేసిన అల్లు అర్జున్!!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు శుభమ్ అరోరా, ప్రశాంత్ చోప్రాలు ఆచితూచి ఆడుతూ.. 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక పరుగు వ్యవధిలో ప్రశాంత్ చోప్రా (21), దిగ్విజయ్ రంగి (0) ఔట్ అవ్వడంతో హిమాచల్ ప్రదేశ్ కష్టాల్లో పడింది. నిఖిల్ గంగ్తా (18) కూడా తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ సమయంలో అరోరాకు అమిత్ కుమార్ (74) మంచి సహకారం అందించాడు. దాంతో హిమాచల్ ప్రదేశ్ లక్ష్యం దిశగా సాగింది. హాఫ్ సెంచరీ అనంతరం అమిత్ కుమార్ ఔట్ అయినా అరోరా చెలరేగాడు.
Also Read: Salman Khan: పాముకాటుకు గురైన సల్మాన్ ఖాన్, శనివారం రాత్రి ఘటన
శుభమ్ అరోరా (Shubham Arora 136)కు జతగా రిషి ధావన్ (Rishi Dhawan) చెలరేగిపోయాడు. 23 బంతుల్లో 42 రన్స్ చేశాడు. దాంతో హిమాచల్ ప్రదేశ్ విజయం దిశగా దూసుకెళ్లింది. హిమాచల్ ప్రదేశ్ 47.3 ఓవర్లలో 299/4తో ఉన్న సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిపివేయబడింది. ఈ సమయంలో ఇరు జట్లకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ చర్చ అనంతరం విజేడీ (VJD) పద్ధతిలో అంపైర్లు హిమాచల్ ప్రదేశ్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో విజయ్ హజారే ట్రోఫీని హిమాచల్ ప్రదేశ్ తొలిసారి ఖాతాలో వేసుకుంది.
THAT. WINNING. FEELING! 👏 👏
The @rishid100-led Himachal Pradesh beat Tamil Nadu to clinch their maiden #VijayHazareTrophy title. 🏆 👍#HPvTN #Final
Scorecard ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/MeUxTjxaI1
— BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook