BCCI announces India women's squad for World Cup 2022: న్యూజిలాండ్‌లో జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022 (ICC Women's World Cup 2022) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం టీమిండియా మహిళల జట్టు (Indian Squad)ను ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపికచేశారు. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన హైదరాబాదీ బ్యాటర్ మిథాలీ రాజ్ (Mithali Raj).. ప్రపంచకప్ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఇక స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ ప్రపంచకప్ అనంతరం మిథాలీ ఆటకు గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో టైటిలే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
ప్రపంచకప్ 2022 జట్టులో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు చోటు దక్కలేదు. గత ఏడాది సరైన ఫామ్‌లో లేని కారణంగా ఆమెను పక్కన పెట్టారు. అయితే జెమీమా ఇటీవల ఇంగ్లండ్‌లోని హండ్రెడ్, ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల బిగ్ బాష్ లీగ్‌లలో అద్భుతంగా ఆడింది. అయినా ఆమెకు నిరాశే ఎదురైంది. శిఖా పాండే (Shikha Pandey), హర్లీన్ డియోల్, రాధా యాదవ్, వేదా కృష్ణమూర్తిలకు కూడా భారత జట్టు (India Women's Squad)లో చోటు దక్కలేదు. సీనియర్లు స్మృతి మందానా (Smriti Mandhana), జూలన్ గోస్వామి.. యంగ్‌స్టర్ షఫాలీ వర్మకు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కింది. స్టాండ్ బై ప్లేయర్లుగా షబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ దిల్ బహదూర్ ఎంపికయ్యారు.
Also Read: IND vs SA: జొహన్నెస్‌బర్గ్ టెస్టు గెలిచి.. ఆ భారత దిగ్గజంకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి: గవాస్కర్
మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు న్యూజిలాండ్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ 2022 జరగనున్నది. భారత్ మార్చి 6న తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. మరోవైపు ప్రపంచకప్ 2022కు ముందు న్యూజిలాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌కు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచకప్ 2022 కోసం ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఆడనుంది. ఏకైక టీ20 మ్యాచ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్సీలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఫిబ్రవరి 9న ఆ మ్యాచ్ జరగనుంది.
🚨 NEWS 🚨: India Women’s squad for ICC Women’s World Cup 2022 and New Zealand series announced. #TeamIndia #CWC22 #NZvIND
More Details 🔽https://t.co/qdI6A8NBSH pic.twitter.com/rOZ8X7yRbV
— BCCI Women (@BCCIWomen) January 6, 2022
ప్రపంచకప్ 2022 భారత జట్టు:
మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతీ మందానా, షఫాలీ వర్మ, యాస్టికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, జూలన్ గోస్వామి, పూజా వస్త్రకార్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ థాకూర్, తానియా భాటియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
స్టాండ్ బై ప్లేయర్లు: షబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ దిల్ బహదూర్.
Also Read: Pushpa OTT Deal: పుష్ప ఓటీటీ రిలీజ్ కోసం అమెజాన్ ప్రైమ్ డీల్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook