Grammy Awards 2022 postponed: యూఎస్ లో కరోనా (COVID-19) కల్లోలం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో...లాస్ ఏంజెల్స్‌లో జరగాల్సిన గ్రామీ అవార్డుల (Grammy Awards 2022) వేడుక వాయిదా పడింది. ఈ విషయమై గ్రామీ అధికారిక ప్రసార సీబీఎస్ (CBS ), ది రికార్డింగ్ అకాడమీ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
64వ వార్షిక గ్రామీ అవార్డుల (64th Annual GRAMMY Awards) వేడుక షెడ్యూల్ ప్రకారం జనవరి 31న నిర్వహించాల్సి ఉంది. ఒమిక్రాన్ (Omicron variant) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి వల్ల ఈవెంట్లో ఇబ్బంది ఏర్పడవచ్చని అకాడమీ అంచనా వేసింది. సంగీత నిర్వహకులు, ప్రేక్షకులు, వేడుక కోసం పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని చెప్పిన అకాడమీ.. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
Also Read: Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!
గతేడాది కూడా కరోనా వల్ల గ్రామీ అవార్డుల వేడుక కొంతకాలం వాయిదా పడింది. ఆ తర్వాత స్టేపుల్స్ సెంటర్‌కు బదులుగా లాస్ ఏంజెల్స్‌లోని (Los Angeles) కన్వెన్షన్ సెంటర్లో అవుట్డోర్ సెట్లో ఈ కార్యక్రమం జరిగింది. గతేడాది ప్రేక్షకుల సీటింగ్ కెపాసిటీ తగ్గించడమే కాకుండా లైవ్ ప్రదర్శన కూడా ఇవ్వలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.