Actor Arun Vijay Corona: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలట్లేదు. సినీ రంగంపై కొవిడ్ (Covid-19) తీవ్రప్రభావం చూపుతోంది. వరుసగా నటీనటులు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, అర్జున్, వడివేలు, మంచు మనోజ్, కరీనా కపూర్, నోరా ఫతేహి తదితర నటులకు కరోనా సోకింది. తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడు చేరాడు. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్‌కు (Arun Vijay) కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
''అందరికీ నమస్కారం!! నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు నేను హోం క్వారంటైన్ లో ఉన్నా. అన్ని ప్రోటోకాల్స్ అనుసరిస్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి''’అంటూ ట్వీట్ చేశాడు అరుణ్. ‘బ్రూస్‌లీ’, ‘సాహో’ సినిమాలతో ఇతడు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ చిత్ర పరిశ్రమలో (Kollywood) వరుసగా నటులు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Hi everyone!!
This is to inform you'll that I have been tested positive for COVID-19. I am currently under home quarantine and following all the safety protocols as per my doctor's advice.
Thanks for all the love..
Stay safe & take care everyone 🙏🏽— ArunVijay (@arunvijayno1) January 5, 2022
Also Read: Meena Tested Covid Postive: సినీ నటి మీనా కుటుంబాన్ని చుట్టిన కరోనా మహమ్మారి
దేశంలో కరోనా థర్డ్ వేవ్ (Covid Third Wave in india) మెుదలైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. కొత్తగా 495 కేసులు వెలుగుఛూశాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.