High BP remedy: బీపీ ఉన్నవారికి హెచ్చరిక.. చలికాలం ఇలా జాగ్రత్త పడండి..!

High BP remedy:  దీర్ఘకాలిక సమస్యల్లో బీపీ (రక్త పోటు) కూడా ఒకటి. చలికాలంలకో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మరి ఈ సీజన్​లో బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 06:46 PM IST
High BP remedy: బీపీ ఉన్నవారికి హెచ్చరిక.. చలికాలం ఇలా జాగ్రత్త పడండి..!

High BP remedy: చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి ఆరోగ్య సమస్యలు (winter health issues) తీవ్రమవుతుంటాయి. ముఖ్యంగా బీపీ, (రక్తపోట) సమస్యలు ఉన్న వారికి ఈ కాలం కాలలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు (BP Problem in Winter) ఉంటాయి.

వీటితో పాటు.. రోగ నిరోధక శక్తి తగ్గుదల వల్ల ఉబ్బసం, కీళ్ల నొప్పుల వంటివి కూడా చలికాలంలో వేగంగా విజృంభిస్తాయి. ముఖ్యంగా చలి తీవ్రత పెరిగే కొద్ది హైపర్ టెన్షన్​, బీపీ వంటి సమస్యలు (Cold Weather effect on BP problems) అధికమవుతుంటాయి.

చలి పెరిగితే.. బీపీ ఎందుకు పెరుగుతుంది (Why BP affected by cold weather?)?

చల్లని వాతావరణం రక్త నాళాలు, ధమనుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. దీని కారణంగా శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని రవాణా చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఫలితంగా బీపీ పెరిగే అవకాశముంటుంది.

వాతావరణంలో మార్పుల వల్ల 65 ఏళ్లు పైబడిన వారిలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. అంతేకాకుండా, శీతాకాలంలో బరువు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా రక్తపోటు స్థాయి పెరుగుదలకు కారణం (Cold weather impact on BP) కావచ్చు. అయితే చలికాలంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుందాం.

ఆల్కహాల్, కెఫిన్​కు దూరంగా ఉండాలి..

చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం తాగడం వల్ల శరీరంలోని వేడిని వేగంగా (Can people with BP drink alcohol?) కోల్పోతారు. ఇది శరీరం ప్రధాన ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ కారణంగా రక్తనాళాలు ఇరుకుగా మారి.. బీపీ పెరగొచ్చు.

అందుకే.. చలికాలంలో ఆల్కహాల్​కు వీలైనంత దూరంగా ఉండటం మేలు. ఇక కెఫిన్​ కూడా పరిమితి కన్నా తక్కువగా ఉంటేనే మంచిదనంటున్నారు వైద్య నిపుణులు.

దుస్తులు ఇలా ఉంటే మేలు(What to wear in winter)..

చలికాలం అంటే స్వెట్టర్లు.. మందపాటి దుస్తులు ధరించడం సాధారణం. అయితే వైద్య నిపుణుల సలహా ఏమిటంటే.. మందపాటిగా ఉంటే ఒకే దుస్తువులను ధరించడానికి బదులు లేయర్లుగా (ఒకదానిపై మరొకటి) దుస్తులు ధరించడం వల్ల వెచ్చగా అనిపించడంతో పాటు.. గుండె పని తీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

ఎక్కువ చల్లగా ఉన్నప్పుడు శరీర భాగాలను మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం మంచిదని (clothing should BP patients wear during the winter) సూచిస్తున్నారు నిపుణులు.

ఈ సీజన్​లో పండే పండ్లు, కూరగాయలు తినాలి (Diet for BP patients)..

బీపీని అదుపులో ఉంచడంలో ఆహారం కీలక పాత్ర (Food for BP patients) పోషిస్తుంది. ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల బీపీని అదుపులో (Best Food for BP patients) ఉంచొచ్చు. ఇప్పటికే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు.. ఎక్కువగా కూరగాయలు, పండ్లు (ఈ సీజన్​లో దొరికేవి) తినాలి. కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, తృణధాన్యాలు మితంగా తీసుకోవాలి.

వ్యాయామం మితంగా ఉండాలి..

వ్యాయామం చేయడం చాలా మంది అలావాటు. అయితే బీపీ ఉన్నవాళ్లు మితంగా వ్యాయామం చేయాలి. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల గుండే వేగం పెరుగుతుంది. ఇది గుండెపై ఒత్తిడి పెంచే అవకాశముంది.

చివరగా..

బీపీ ఉన్న వాళ్లు ఎక్కువగా చలి ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం (Health Tips for BP patients) మేలు. శరీరాన్ని వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. దీనితో పాటు జనసమూహాల్లో ఎక్కువగా సంచరించకపోవడం (Winter Tips for BP patients) మంచిది.

Also read: Omicron Variant: అత్యంత వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేయదా

Also read: Sugar Craving: స్వీట్స్ కోరిక అణచుకోలేకపోతున్నారా..సులభమైన ఈ చిట్కాలు పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News