Vijayawada Rainfall Today: ఇరు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల నుంచి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ప్రారంభమైన వర్షాలు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ కురిశాయి. విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది.
భారీ వర్షపాతం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షాపు నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే నగరంలోని అనేక కాల్వలో చెత్తచెదారం తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో అధికారులు వర్షపు నీటిని తోడుతున్నారు.
వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో మూడు రోజులు వర్షాలు
రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
దీనితో పాటు దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాయలసీమలో కూడా ఒకట్రెండుచోట్ల నేడు, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: విశాఖలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన జీపు.. ఇద్దరు మృతి...
Also Read: AP Corona cases: ఏపీలో కొత్తగా 4,348 మందికి కొవిడ్ పాజిటివ్- 14 వేలపైకి యాక్టివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook