Lucknow IPL Team Name: లక్నో సూపర్ జెయింట్స్.. టీమ్ పేరు ప్రకటించిన లక్నో ఫ్రాంచైజీ

Lucknow IPL Team Name: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా చేరిన లక్నో ఫ్రాంఛైజీ తమ టీమ్ పేరును అధికారికంగా ప్రకటించింది. అభిమానుల సూచన మేరకు 'లక్నో సూపర్ జెయింట్స్' అనే పేరును ఫైనలైజ్ చేసినట్లు ఆ జట్టు యజమాని సంజీవ్ గొయంకా వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 05:05 PM IST
    • ఐపీఎల్ 2022 మెగా వేలానికి సిద్ధమైన లక్నో ఫ్రాంచైజీ
    • లక్నో సూపర్ జెయింట్స్ గా టీమ్ పేరు ఖరారు
    • అధికారికంగా ప్రకటించిన ఓనర్ సంజీవ్ గొయంకా
Lucknow IPL Team Name: లక్నో సూపర్ జెయింట్స్.. టీమ్ పేరు ప్రకటించిన లక్నో ఫ్రాంచైజీ

Lucknow IPL Team Name: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2022)లో ఈ ఏడాది నుంచి మరో రెండు కొత్త టీమ్స్ చేరనున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న మెగా వేలంలో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు పాల్గొననున్నాయి. ఇదే విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గతంలో ప్రకటన కూడా చేసింది. 

ఈ నేపథ్యంలో లీగ్ లో కొత్తగా పాల్గొననున్న లక్నో ఫ్రాంఛైజీ పేరును.. ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గొయెంకా అధికారికంగా ప్రకటించారు. తమ జట్టు అభిమానుల సూచన మేరకు 'లక్నో సూపర్‌ జెయింట్స్‌' పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

లక్నో ప్రాంఛైజీకి పేరు సూచించాలని జనవరి 3న ఆ జట్టు యాజమాన్యం 'నామ్‌ బనావో.. నామ్‌ కమావో' పేరిట ఆన్‌లైన్‌లో ఓ సర్వే నిర్వహించింది. అక్కడ అభిమానులు సూచించిన ఉత్తమ పేర్లను పరిగణనలోకి తీసుకున్న జట్టు యాజమాన్యం.. ఆఖరికి 'లక్నో సూపర్‌ జెయింట్స్‌' పేరును ఖరారు చేసింది.

ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ లో 10 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్రాంఛైజీలతో పాటు లక్నో, అహ్మదాబాద్ జట్లు లీగ్ లో అడుగుపెట్టనున్నాయి. అయితే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.   

Also Read: Chateshwar Pujara Birthday: టీమ్ ఇండియా క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా పుట్టినరోజు ఇవాళ

Also Read: KL Rahul: టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News