Exclusive interview with Minister Harish Rao: తెలంగాణకు వాస్తవానికి ఉన్న అప్పులెన్ని, ఎంత అభివృద్ధి జరిగింది? మంత్రి హరీశ్ రావు ఏం చెబుతున్నారు

Zee Telugu News Interview with Harish Rao: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో, ఇప్పుడు అదే స్ఫూర్తితో పని చేస్తున్నామంటోన్న మంత్రి హరీశ్... తెలంగాణకు సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు. మంత్రి హరీశ్ రావుతో జీ తెలుగు న్యూస్ .. స్పెషల్ ఇంటర్వ్యూపై ఓ లుక్కేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 02:10 PM IST
  • తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో జీ తెలుగు న్యూస్‌ స్పెషల్ ఇంటర్వ్యూ
  • మంత్రితో పలు విషయాలపై చర్చించిన జీ తెలుగు న్యూస్ ఎడిటర్‌‌ భరత్‌ కుమార్
  • తెలంగాణలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చ
Exclusive interview with Minister Harish Rao: తెలంగాణకు వాస్తవానికి ఉన్న అప్పులెన్ని, ఎంత అభివృద్ధి జరిగింది? మంత్రి హరీశ్ రావు ఏం చెబుతున్నారు

Harish Rao Exclusive Interview in Zee Telugu News : తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో జీ తెలుగు న్యూస్‌ (Zee Telugu News) ఎడిటర్‌‌ భరత్‌ కుమార్ (Bharath Kumar) పలు విషయాలపై చర్చించారు. తెలంగాణలోని (Telangana) ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చ కొనసాగింది. 

అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు ఉద్యమ నేతగా ఉన్న మీరు... నేడు తెలంగాణ మంత్రిగా పని చేస్తున్నారు. అప్పటికి, ఇప్పటికీ రాజకీయపరంగా ఎలాంటి తేడాలు వచ్చాయి అనే ప్రశ్నకు హరీశ్ రావు (Telangana Minister Thaneeru Harish Rao) ఇలా సమాధానం ఇచ్చారు. ఆ రోజు రాష్ట్రం కోసం పోరాడాం.. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నాం అంటూ మంత్రి పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఉద్యమ స్ఫూర్తితోనే తమతో పని చేయిస్తాన్నారంటూ హరీశ్‌ రావు తెలిపారు. 

ఆ రోజు ఉద్యమంలో రోజుకు 18 గంటలు పని చేశామని... ప్రస్తుతం ప్రభుత్వంతో కూడా కేసీఆర్‌‌ అదే స్ఫూర్తితో పని చేయిస్తున్నారని వెల్లడించారు మంత్రి హరీశ్. (Harish Rao) దేశానికే ఆదర్శంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని అన్నారు. 

పలు ఆర్థిక విధానాలను అవలంబిస్తూ తెలంగాణ ప్రగతిపథంలో దూసుకెళ్తుందన్నారు. అలాగే రైతుల కోసం ఎన్నో పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయరంగంలో కూడా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. 

తెలంగాణ అప్పులు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదం, అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మాట్లాడారు. అందుకు సంబంధించిన ఫుల్ వీడియో ఇదిగో..

 

Also Read: Telangana Drugs Case : తెలంగాణలో డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపుతామంటోన్న సీఎం కేసీఆర్‌‌

నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా తెలంగాణకు అప్పులు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయంటూ మంత్రిని ప్రశ్నించగా.. "దేశంలో పెద్దపెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ అప్పుల విషయంలో చాలా దిగువ స్థాయిలో ఉందంటూ" మంత్రి స్పష్టం చేశారు. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికే ఇందుకు నిదర్శమని మంత్రి హరీశ్ (Harish Rao) రావు పేర్కొన్నారు.

Also Read: TRS District Presidents: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News