AP SGT's to get promotions as School Asistants: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు(SGT) ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్ నాటికి 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు దక్కనున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్లను మ్యాపింగ్ చేస్తున్న నేపథ్యంలో ఎస్జీటీలు ఎస్ఏలుగా ప్రమోట్ కానున్నారు. నూతన విద్యా విధానం అమలుపై సీఎం జగన్ గురువారం (ఫిబ్రవరి 4) విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తాజా సమీక్షలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ను అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటివరకూ 19 వేల స్కూళ్ల మ్యాపింగ్ పూర్తయిందని.. మరో 17వేల స్కూళ్లలో ఇంకా మ్యాపింగ్ జరగలేదని తెలిపారు. ఆయా స్కూళ్ల మ్యాపింగ్, టీచర్ల రేషనలైజేషన్ ద్వారా మొత్తం 30వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు దక్కుతాయని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. టీచర్ల స్కిల్స్ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు అమలులోకి రావాలని సీఎం జగన్ (CM YS Jagan) పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక కో-ఎడ్యుకేషన్ కాలేజీతో పాటు గర్ల్స్ కాలేజీ మండల కేంద్రాల్లో ఏర్పాటు కావాలన్నారు. ఇక నూతన విద్యా విధానం అమలుతో స్కూళ్లు మూతపడుతాయి... టీచర్ల సంఖ్య తగ్గుతుందనే ప్రచారాన్ని సీఎం కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్‌లో తరగుతుల విలీనం తప్ప స్కూళ్ల విలీనం జరగట్లేదని స్పష్టం చేశారు. మ్యాపింగ్ ద్వారా టీచర్ల ఉద్యోగాలు పోవని.. ఎస్జీటీలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు దక్కుతాయని పేర్కొన్నారు.
Also Read: Chalo Vijayawada: ఆ జనసందోహాన్ని చూసి రాంగోపాల్ వర్మకు చలి జ్వరం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook