Cinema Ticket Rates Issue: సినిమా టికెట్‌ రేట్స్‌ సమస్యకు శుభం కార్డు, త్వరలో జీవో : చిరంజీవి

Tollywood Celebrities with CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సినీ ఇండస్ట్రీ సమస్యలపై జరిగిన ఈ భేటీ విజయవంతమైంది.

Last Updated : Feb 10, 2022, 03:15 PM IST
  • సీఎం జగన్‌తో పలువురు సినీ ప్రముఖులు భేటీ
  • విజయవంతమైన భేటీ
  • ఏపీలో సినిమా టికెట్‌ రేట్స్‌ సమస్యకు శుభం కార్డు
  • సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం సంతోష పరిచిందన్న మెగాస్టార్ చిరంజీవి
Cinema Ticket Rates Issue: సినిమా టికెట్‌ రేట్స్‌ సమస్యకు శుభం కార్డు, త్వరలో జీవో : చిరంజీవి

AP Movie Ticket Rates Issue: ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఏపీలో సినిమా టికెట్‌ రేట్స్‌ సమస్యకు శుభం కార్డు పడినట్లుగా తాము భావిస్తున్నామంటూ ఆయన తెలిపారు. ఇవాళ సీఎం జగన్‌తో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ విజయవంతమైంది. భేటీ అనంతరం చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలను ఏపీ సీఎం జగన్‌ తీసుకున్నారన్నారు. అలాగే సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమా సమస్యల పరిష్కారానికి సంబంధించిన జీఓ ఈ నెలాఖరులోగా వస్తుందని తాము భావిస్తున్నామన్నారు.

ఏపీలో ఐదోషోకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చొరవ వల్లే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చిరంజీవి అన్నారు. ఈ భేటీ ఏర్పాటు చేయడంలో ఆయన ఎంతో శ్రద్ద వహించారన్నారు. హైదరాబాద్‌ తరహాలో విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని సీఎం జగన్‌ చెప్పారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ విషయంలో తమ వంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.

గత కొని నెలలుగా సినీ ఇండస్ట్రీ సందిగ్ధంలో ఉండగా... చిరంజీవి ముందడుగు వేసి తమకు దారి చూపించారంటూ మహేశ్ బాబు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి సీఎంకు, మంత్రి పేర్ని నానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఇక ఈ విషయంలో సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్‌ రాజమౌళి. సీఎం అందరి అభిప్రాయాల్ని ఎంతో ఓపిగ్గా విన్నారంటూ చెప్పుకొచ్చారు జక్కన్న. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీ సందిగ్ధంలో ఉండగా.. మెగాస్టార్‌‌ పరిష్కారం దిశగా కృషి చేశారన్నారు. చిరంజీవికి ఇష్టం ఇండస్ట్రీ పెద్ద అంటే ఇష్టం ఉండదు కానీ.. ఆయన అది నిరూపించుకున్నారన్నారు. సీఎంతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యంతో ఈ సమస్యను పరిష్కరించారన్నారు. 

సీఎం జగన్‌ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రభాస్ పేర్కొన్నారు. సీఎం జగన్‌కు, చిరంజీవికి ప్రభాస్‌ ధన్యవాదాలు తెలిపారు. చిన్న సినిమాలను అండగా నిలవాలని సీఎంను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆర్‌ నారాయణమూర్తి అన్నారు.

Also Read: AP Inter and Tenth Exams: ఏపీ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Also Read: IND vs WI: భారత్‌లో ఇలాంటి స్పెల్ ఎప్పుడూ చూడలేదు.. అతడు అద్భుత బౌలర్: రోహిత్ శర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News