మీమ్స్. నిజ జీవితంలో జరిగే విభిన్న సంఘటనలపై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే జోక్స్. వాస్తవానికి చేరువలో చూస్తే నవ్వు తెప్పించడమే కాకుండా..విషయం అర్ధమయ్యేట్టు వ్యంగ్యంగా ఉంటాయి. ఇప్పుడీ మీమ్స్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై పేలుతున్నాయి. అవేంటో చూసేద్దాం
రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం రగులుతోంది. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్డ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదంపై చర్చ జరిగింది. అయితే ఈ సమావేశం సందర్భంగా ఫోటోలో ఇద్దరి మధ్య ఉన్న ఓ టేబుల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు చర్చ కాస్తా పక్కకుపోయి..మీమ్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒలాఫ్ స్కోల్డ్, వ్లాదిమిర్ పుతిన్‌లు కూర్చున్న కుర్చీల మధ్య ఏకంగా 20 అడుగుల పొడవైన టేబుల్ ఉంది. టేబుల్‌కు అటూ ఇటూ కూర్చున్నారిద్దరూ. అంటే సోషల్ డిస్టెన్సింగ్ బాగా పాటిస్తున్నారని అర్దం చేసుకోవచ్చు. నిజంగానే భౌతిక దూరం కోసం అంత పొడవైన టేబుల్ వాడారా, లేదా పుతిన్ రక్షణను దృష్టిలో ఉంచుకుని సెట్ చేశారా అనేది చర్చగా మారింది.
ఈ మధ్యన పుతిన్ ఎవరితో సమావేశమైనా ఇదే టేబుల్ ఉపయోగిస్తున్నారు. గత వారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన చర్చలో కూడా ఇదే టేబుల్ ఉంది. ఇలాగే 20 అడుగుల దూరంలో కూర్చుని ఫోటోలు దిగారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వరుసగా రెండుసార్లు ఇంత పెద్ద టేబుల్ ఉపయోగించడంతో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. రకరకాల మీమ్స్ ప్రాచుర్యంలో వచ్చేశాయి. ఈ మీమ్స్ చూస్తే పరిస్థితి మీకే తెలుస్తుంది. నవ్వాపుకోలేరు.
The long table at which Putin and Macron sat during the talks in Moscow became an occasion for many mimes and the subject of jokes. pic.twitter.com/0btLBFJNJN
— Spriter (@spriter99880) February 8, 2022
ఈ టేబుల్‌పై గేమ్స్ ఆడుతున్నట్టుగా, జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్టుగా, స్కేటింగ్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా , సామూహిక భోజనాలు చేస్తున్నట్టుగా వివిధ రకాల మీమ్స్ ప్రాచుర్యంలో ఉన్నాయి.
మరి కొద్దిమందైతే..ఏకంగా ప్రముఖ ఫర్నిచర్ కంపెనీ ఐకియాకు సలహాలు ఇస్తున్నారు. ఐకియా కంపెనీ తయారు చేసే అతిపెద్ద టేబుల్‌కు పుతిన్ టేబుల్‌గా పేరు పెట్టమంటున్నారు. అలా చేయడం ద్వారా పెద్ద టేబుల్ అని కస్టమర్లకు అర్ధమవుతుందట.
— Krzysztof Dykas (@krzysztof_dykas) February 15, 2022
వాస్తవానికి ఈ టేబుల్ కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చేసింది కానే కాదట. దాదాపు 25 ఏళ్ల క్రితమే ఈ టేబుల్ తయారైందట. ఇంత పెద్ద టేబుల్ ఏ కారణంతో వినియోగించినా..సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. మీమ్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
Also read: Snake In Airasia: ఎయిర్ ఏషియా విమానంలో పాము కలకలం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook