Home Remedies: ఆధునిక జీవనశైలి కారణంగా రోజురోజుకూ అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆహారపు అలవాట్ల కారణంగా ఎసిడిటీ, నిద్రలేమి, మల బద్ధకం, అజీర్ణం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి.. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలనేది పరిశీలిద్దాం.
మనిషి ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆధునిక జీవనశైలి కారణంగా అనారోగ్యం అందర్నీ వెంటాడుతోంది. ముఖ్యంగా క్రమబద్ధంగా లేని ఆహారపు అలవాట్లు. సమయానికి భోజనం చేయకపోవడం సరైన నిద్ర లేకపోవడం, టెన్షన్, ఒత్తిడి వంటి వాటివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి భోజనానికి మధ్య నిర్ధారిత గ్యాప్ చాలా ముఖ్యం. బిజీ లైఫ్ కారణంగా వేళ కాని వేళల్లో భోజనం చేయడం లేదు. ఫలితంగా ఎసిడిటీ, మల బద్దకం, అజీర్తి వంటి సమస్యలు వస్తున్నాయి. కొన్ని సాధారణ జీవనశైలిలో మార్పులతోనే ఈ సమస్యల్ని నివారించవచ్చు. కొన్ని రకాల చిట్కాల ద్వారా ఎసిడిటీ, నిద్రలేమి, మల బద్ధకం నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
ఎసిడిటీ, మలబద్ధకం, నిద్రలేమి దూరం చేసే చిట్కాలు
ఎన్ని పనుల్లో ఉన్నా సరే వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ 7-8 గ్లాసుల నీరు తప్పకుండా సేవించాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ దూరం చేస్తే మంచిది. ఎక్కువగా కారం, పులుపు, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం మానేయాలి. తినే ఆహారం ఎదైనా సరే..మితంగా ఉండేట్టు చూసుకోవాలి. సిగరెట్ స్కోకింగ్, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్‌ను సాధ్యమైనంతవరకూ తీసుకోకూడదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఈ అలవాట్లు చేసుకుంటే..బాడీలో మెటాబాలిజం సమతుల్యంగా ఉంటుంది. రాత్రి వేళల్లో భోజనం చేసిన వెంటనే పడుకోవడం మంచి అలవాటు కాదు. నిద్రపోడానికి కనీసం గంట ముందు భోజనం పూర్తి కావాలి. లేకపోతే ఎసిడిటీ ఉత్పన్నమవుతుంది.
ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతుంటే మాత్రం వంటింటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కొత్తిమీర నీరు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్షల్ని పరగడుపున ప్రతిరోజూ తీసుకోవాలి. రోజుకోసారి భోజనం తరువాత కొద్దిగా సోంపు తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. మద్యాహ్నం వేళల్లో కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం లేదా వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ క్రియ బాగుంటే ఏ విధమైన సమస్య తలెత్తదు. అందుకే పుదీనా వాటర్ లేదా రోజ్ వాటర్ అలవాటు చేసుకోండి. నిద్రలేమి సమస్య, మలబద్ధకంతో బాధపడుతుంటే..రోజూ పడుకునేముందు ఒక స్పూన్ ఆవు నెయ్యితో గోరు వెచ్చని పాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. రోజూ భోజనం తరువాత కొద్దిగా ధనియాలు నమిలి తింటే..ఎసిడిటీ దరిదాపుల్లో చేరదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
Also read: Dry Skin vs Kidney Disease: చర్మం పొడిబారుతోందా..లైట్‌గా తీసుకోవద్దు..ఆ వ్యాధి కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.