E-PAN Card: ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డుతో పాటు తప్పనిసరిగా మారుతున్నది పాన్‌కార్డ్. వాలిడ్ ప్రూఫ్‌గా అంగకీరిస్తున్న ఈ పాన్ కార్డు వేతన ఉద్యోగులకైతే తప్పకుండా కావల్సిందే. ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే పాన్ కార్డు తప్పదు మరి. ఇ పాన్‌కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత అవసరమో..ఉద్యోగులకు, వ్యాపారస్థులకు పాన్‌కార్డు అంత ముఖ్యంగా మారింది. చాలా విషయాల్లో పాన్‌కార్డును వాలిడ్ ప్రూఫ్‌గా కూడా అంగీకరిస్తున్న పరిస్థితి. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా..బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేయాలన్నా, డీమ్యాట్ ఎక్కౌంట్ తెరవాలన్నా పాన్‌కార్డు తప్పదు. వ్యక్తిగతంగా 50 వేలకంటే ఎక్కువ డిపాజిట్ చేసేటప్పుడు కూడా పాన్ నెంబర్ తప్పకుండా నమోదు చేయాలి.
పాన్‌కార్డు వినియోగించేవారి ఆర్ధిక లావాదేవీల్ని ప్రభుత్వం ట్రాక్ చేసేందుకు పాన్‌కార్డు దోహదపడుతుంది. అయితే ప్రతిసారీ పాన్‌కార్డును భౌతికంగా తీసుకెళ్లక్కర్లేదు. ఇ పాన్‌కార్డు సరిపోతుంది. ఎప్పుడైనా పాన్‌కార్డు పోయినా ఇ పాన్‌కార్డుతో పనైపోతుంది. ఇ పాన్‌కార్డును చాలా సులభంగా మీరే డౌన్‌లౌడ్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN ఓపెన్ చేయాలి. ఇందులో Apply for PAN క్లిక్ చేసి..అక్కడున్న దరఖాస్తు నింపాలి. ఆ తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ వివరాలు సరిచూసుకునే అవకాశం లభిస్తుంది. మీ వివరాల్ని సరిచూసుకున్న తరువాత Generate OTP బటన్ ప్రెస్ చేసి..మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. ఆ తరువాత Paid e-PAN Download Facility ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు పేమెంట్ విధానాన్ని ఎంచుకుని..కేవలం 9 రూపాయలు చెల్లించాలి. ఆ తరువాత కంటిన్యూ బటన్ ప్రెసి చేసి..పాన్‌కార్డు పేమెంట్ రిసీప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇ పాన్‌కార్డు ఆటోమేటిక్‌గా మీ పీసీ లేదా మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇదే ఇ పాన్కార్జు పీడీఎఫ్ ఫైల్ కావాలంటే మాత్రం పాస్‌వర్డ్‌తో వ్తుంది. అది మీ డేటాఫ్ బర్త్‌తో కూడి ఉంటుంది.
Also read: Business Yantra: వ్యాపారంలో సక్సెస్‌కి వ్యాపార వృద్ధి యంత్రం.. దీనితో ఎన్ని ప్రయోజనాలున్నాయంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook