Ukraine Crisis: రష్యన్ మిలటరీ ట్యాంకును ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు, వీడియో వైరల్

Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు రష్యన్ మిలటరీ ట్యాంక్ ను దొంగలించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 08:26 AM IST
  • ర‌ష్యా సైనికుల‌కు చుక్క‌లు చూపుతున్న ఉక్రెయిన్ పౌరులు
  • రైతు వెంట ప‌రుగులు తీసిన ర‌ష్యా సోల్జర్
  • వీడియోను షేర్ చేసిన బ్రిట‌న్ ఎంపీ జానీ మెర్స‌ర్
Ukraine Crisis: రష్యన్ మిలటరీ ట్యాంకును ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు, వీడియో వైరల్

 Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine War) ఏడో రోజుకు చేరింది. అయితే రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. అంతే దీటుగా ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియాలో (Social Media) ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఓ వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకును ఒంటిచేత్తో ఆపి.. అందరి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.  

రష్యా బలగాలు దాడి చేసేందుకు యుద్ధ ట్యాంకర్‌తో (Russian military tank) ఓ ప్రాంతానికి వెళ్తాయి. అది గమనించిన ఓ రైతు (Ukrainian Farmer) గుట్టుచప్పుడు కాకుండా తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను  కట్టి తరలించుకుపోతాడు. అది గమనించిన రష్యా సైనికుడు ఆ ట్రాక్టర్ వెంట పరిగెడతాడు. ఏడు  సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్స్ పగలబడి నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను బ్రిటిష్ కన్జర్వేటివ్ నేత, ప్లైమౌత్ మూర్ వ్యూ పార్లమెంటు సభ్యుడు జానీ మెర్సర్ (Johnny Mercer) ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4.6 మిలియన్ మంది వీక్షించారు. 

2014 నుండి 2021 వరకు ఆస్ట్రియాలో ఉక్రెయిన్ రాయబారిగా పనిచేసిన ఒలెగ్జాండర్ షెర్బా కూడా ఈ వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా"ఉక్రేనియన్లు నిజంగా కఠినమైన కుకీలు" అంటూ ఆయన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ వీడియో తమకు నవ్వు తెప్పిస్తోందని చెబుతూ నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Viral Video: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపేసిన ఉక్రెయిన్ వాసి, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News