Case filed against Pawan Kalyan Fans: చిత్తూరు పోలీసులు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ఇటీవల 'భీమ్లా నాయక్' సినిమా విడుదల సందర్భంగా మేకను బలిచ్చినట్లు ఫిర్యాదు అందడంతో.. కొందరు పవన్ అభిమానులపై జంతు బలి కేసు నమోదు చేశారు. జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపినట్లు తెలుస్తోంది. అషర్ అనే న్యాయవాది ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కల్యాణ్ అభిమానులు మేకను బలిస్తున్న ఫోటోను కూడా అషర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పవన్ కల్యాణ్ హీరోగా, రానా విలన్ పాత్రలో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ సినిమా అయప్పన్ కోషియమ్‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. గత 10 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.74.11 కోట్ల షేర్, రూ.113 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 94.66 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా ఇప్పటికే భీమ్లా నాయక్ రూ.150 కోట్ల క్లబ్‌లో చేరింది.
'భీమ్లా నాయక్'కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలు, తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సక్సెస్ కావడంతో ఇటీవల పవన్ కల్యాణ్ చిత్ర యూనిట్‌కు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
PM speaks to Putin: 'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'.. పుతిన్‌కు ప్రధాని మోదీ సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook