Paytm Payments Bank: ప్రముఖ పేమెంట్స్ బ్యాంక్ సేవల సంస్థ.. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు షాకిచ్చింది ఆర్బీఐ. పేమెంట్ బ్యాంక్‌లోకి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని సూచించింది.
దీనితో పాటు.. పేటీఎం పేమెంట్ బ్యాంక్ వెంటనే.. ఐటీ ఆడిట్ సంస్థను ఆపాయింట్ చేసుకుని సమగ్ర ఆడిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ విడదల చేసిన ప్రెస్ రిలీజ్లో ఈ విషయాన్ని పేర్కొంది.
'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీబీబీఎల్)ను తక్షణమే కొత్త కస్టమర్లకు చేర్చుకోవడంపై నిషేధం విధించాం. పరిశోధనలో కొన్ని అవకతవకలు జరిగినట్లు తెలిసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం ఇన్‌కం ట్యాక్స్ ఆడిట్ చేయాలని కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆదేశించా'మని ఆర్బీఐ నిర్ణయించింది.
Action against Paytm Payments Bank Ltd under section 35 A of the Banking Regulation Act, 1949https://t.co/tqWfwt7mT3
— ReserveBankOfIndia (@RBI) March 11, 2022
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది ఆర్బీఐ. అయితే పీపీబీఎల్‌లో జరిగిన అవకతవకలు ఏమిటి అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also read: Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ.. డీల్స్ ఇవే..
Also read: Pepaid Recharge Plans: ఎయిర్టెల్, వి, జియోల్లో.. రూ.200 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో అవకతవకలు.. ఆర్బీఐ బ్యాన్!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ చర్యలు
ఆర్థిక అవకతవకలే కారణం!
కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశం