Lion Vs Buffalo Funny Video: గేదెలకు భయపడి చెట్టు ఎక్కిన మృగరాజు- వీడియో వైరల్!

Lion Vs Buffalo Funny Video: సోషల్ మీడియాలో తరచూ ఏదొక వీడియో వైరల్ గా మారుతుంటుంది. వాటిలో కొన్ని నవ్విస్తే, కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. గేదెల గుంపుకు బయపడి సింహం చెట్టు ఎక్కింది. ఆ వీడియో ఇప్పుడు పలువురు నెటిజన్లను ఆకర్షిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 07:31 PM IST
Lion Vs Buffalo Funny Video: గేదెలకు భయపడి చెట్టు ఎక్కిన మృగరాజు- వీడియో వైరల్!

Lion Vs Buffalo Funny Video: ఇంటర్నెట్‌లో మనం చూసే వీడియోలలోని కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరికొన్ని మనల్ని హాయిగా నవ్విస్తాయి. సోషల్ మీడియాలో ఇలా అనేక వింతైన వీడియోలు తరచూ ట్రెండ్ అవుతుంటాయి. జంతువులు వీడియోలు ఇటీవలీ కాలంలో తరచుగా వీడియో వైరల్ గా మారుతున్నాయి. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటో మీరూ చూసేయండి. 

వీడియోలో ఏముందంటే? 

అడవిలో సింహాలు, పులులు ఇతర జంతువులను వేటాడడం మనం తరచుగా ఏదో ఒక వీడియోలో చూస్తుంటాం. సింహం గర్జన వినగానే మిగతా జంతువులు కూడా విచ్చలవిడిగా పారిపోతుంటాయి. కానీ, కొన్ని జంతువులు మాత్రం మృగరాజుపై తిరగబడి వెంటాడడం మాత్రం అరుదు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అడవిలో కొన్ని గేదెలు గడ్డిని మేసేందుకు వచ్చాయి. అటుగా వచ్చిన సింహం వాటిని వేటాడాలని భావించింది. అయితే ఆ గేదెల గుంపు కలిసి సింహంపై తిరిగబడ్డాయి. దీంతో చేసేదేమి లేక సింహం చెట్టుపైకి ఎక్కింది. అయితే చెట్టును పూర్తిగా ఎక్కలేక కొమ్మను పట్టుకొని వేలాడుతుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. 



ఈ వీడియో Wild_animal_shorts Instagram అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయ్యింది. సామాజిక మాధ్యమాల్లో ఇది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read: McDonald's Burger: మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ ధర రూ.26,000.. పోటీపడి మరీ కొంటున్న ఫుడీస్!

Also Read: Bride Gun Firing: పెళ్లిలో తుపాకి పట్టిన వధువు.. షాక్ లో వరుడు తరపు బంధువులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News