Viral Video: రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్నాడో టీనేజర్... ఇంతలో రైలు ప్లాట్‌ఫామ్ పైకి ఎంటరైంది... అంతే.. ప్లాట్‌ఫామ్‌పై నిలబడి ఉన్న అతను ఒక్కసారిగా ట్రాక్ పైకి దూకేశాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో దానికి ఎదురెళ్లబోయాడు. ఇంతలో అక్కడే ఉన్న రైల్వే పోలీస్.. వెంటనే ట్రాక్ పైకి దూకి ఆ టీనేజర్ ప్రాణాలను కాపాడాడు. అతను ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా విఠల్వాడి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను గమనిస్తే... ప్లాట్‌ఫామ్‌పై నిలబడి ఉన్న టీనేజర్ ఉన్నట్టుండి రైల్వే ట్రాక్‌పై దూకేయడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. వెంటనే రైల్వే పోలీస్ అతన్ని గమనించి స్పందించకపోయి ఉంటే యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ ఆ యువకుడిని కాపాడిన పోలీస్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అదే సమయంలో ఆత్మహత్యకు యత్నించిన ఆ టీనేజర్‌పై మండిపడుతున్నారు. ఆ టీనేజర్ ఎందుకలా చేశాడో ప్రశ్నించాలని అంటున్నారు. సోషల్ మీడియా కోసమే ఇలా చేశాడా.. లేక ఏవైనా సమస్యల కారణంగా ఆత్మహత్యకు యత్నించాడా తెలుసుకోవాలని అంటున్నారు. ఆ టీనేజర్ని రక్షించిన రైల్వే పోలీస్‌కి తగిన రివార్డు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వీడియోకి ట్విట్టర్లో ఇప్పటివరకూ 2 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.
#WATCH | Maharashtra: A police personnel saved a teenage boy's life by pushing him away from the railway track just seconds before an express train crossed the spot at Vitthalwadi railway station in Thane district. (23.03)
Video Source: Western Railway pic.twitter.com/uVQmU798Zg
— ANI (@ANI) March 23, 2022
Also Read: Ram Charan Boxing: RRR మూవీ ఆ ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి!
Also Read: RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేయండి.