Viral Video: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో ఓ అవమానీయ ఘటన జరిగింది. నడిరోడ్డులో ఈ-రిక్షా నడిపై డ్రైవర్ పై పోలీసు చెంపదెబ్బ కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏం జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ ఈ-రిక్షాను ఆపిన పోలీసు ఆ డ్రైవర్ పై నడిరోడ్డులో చేయి చేసుకున్నాడు. డైవర్ ను చెంపదెబ్బ కొట్టడం సహా అసభ్యంగా మాట్లాడాడు. ఆ డ్రైవర్ ను కొట్టడం సహా రూ. 500 జరిమానాను కూడా ఆ పోలీస్ విధించాడు. దీంతో ఆ దెబ్బకు తట్టుకోలేని డ్రైవర్ ఏడ్చుకుంటూ తన రిక్షా వద్దకు వెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
MP: सब इंस्पेक्टर ने ई-रिक्शा चालक को जड़े चांटे, 'थप्पड़बाज' पुलिसकर्मी का वीडियो वायरल
#MadhyaPradesh #ViralVideo pic.twitter.com/mdjuhz6A2q— Zee News (@ZeeNews) March 25, 2022
ఈ ఘటన ఇండోర్ లోని విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసోమా కూడలిలో జరిగింది. చెంపదెబ్బ కొట్టిన పోలీసు పేరు సబ్ ఇన్‌స్పెక్టర్ బలరాం దీక్షిత్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాధితుడు ఈ-రిక్షా డ్రైవర్ పరదేశిపుర ప్రాంతంలో నివాసి. అతని పేరు బాలకృష్ణ అని స్థానికులు వెల్లడించారు.
Also Read: Dog Volleyball: మనుషుల్లా వాలీబాల్ ఆడుతున్న వీధి శునకాలు.. వీడియో వైరల్!
Also Read: King Cobra: 12 అడుగులు పొడవున్న భయంకరమైన కళింగ సర్పాన్ని ఎప్పుడైనా చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook