IPL 2022 Match 1 KKR Playing 11 vs CSK: క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 2022 ఈరోజు రాత్రి ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య శనివారం రాత్రి 7.30 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌తో 15వ సీజన్‌కు తెరలేవనుంది. పటిష్టంగా ఉన్న రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గెలుపుతో టోర్నీని ఆరంభించాలని కొత్త కెప్టెన్లు చుస్తున్నారు. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
గతేడాది వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్న యువ ఓపెనర్ శుభమాన్ గిల్.. ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు వెళ్లిపోయాడు. దాంతో వెంకటేశ్ అయ్యర్‌కు జతగా భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే బరిలోకి దిగనున్నాడు. సునీల్ నరైన్ కూడా అందుబాటులో ఉన్నా.. జింక్స్ మెగా టోర్నీలో ఎక్కువగా ఓపెనింగ్ చేశాడు. అందుకే రహానేనే ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. దాంతో నరైన్ మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగనున్నాడు. ఆపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా వస్తారు.
వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ ఐదవ స్థానంలో రానుండగా.. 6, 7లో ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ బ్యాటింగ్ చేస్తారు. పేస్ విభాగంలో టీమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్ బరిలోకి దిగుతారు. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. అతడికి జతగా నరైన్ ఉండనే ఉన్నాడు. రసెల్, వెంకటేష్ కూడా పేస్ బౌలింగ్ వేయగలరు. మొత్తానికి కోల్‌కతా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. శ్రేయాస్ ఆటగాళ్లను ఉపయోగించుకుంటే చెన్నైపై విజయం సులువే.
కోల్‌కతా తుది జట్టు (అంచనా):
వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
Also Read: TS Traffic Challans: పొడిగింపు లేదు.. ట్రాఫిక్ చలాన్ రాయితీ ఈ నెలాఖరు వరకే! వెంటనే త్వరపడండి!!
Also Read: Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook