Digital Hundi's in Telangana: కలికాలం వచ్చేసింది. దేవుడి సొమ్ముకే ఎసరు పెడుతోంది నేటి యువత. ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక హుండీ చోరీకి గురి అవుతూనే ఉంది. భక్తులు ఎంతో భక్తితో ... తమ శక్తిమేరకు సమర్పించే కానుకలు దొంగల పాలు అవుతున్నాయి. దీంతో ఈ అరాచకాలను చెక్ పెడుతూ తెలంగాణలోని గుళ్లు గోపురాలు మెళ్లి మెళ్లిగా మారుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ చోరీలకు చెక్ పెడుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని డిజిటల్ ఫార్మాట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
గుడికి వచ్చి మొక్కులు చెల్లించుకొనే భక్తులు హుండీలో డబ్బులు వేసే బదులు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా సదరు డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతి కూడా తీసుకుంది. ఈపాటికే ఎన్నో ధార్మిక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి రావడంతో కాలక్రమంలో డిజిటల్ హుండీ కూడా ఆందుబాటులోకి వచ్చింది. మొట్ట మొదటి సారిగా ఈ ట్రెండ్ యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో అమలులోకి వచ్చి మిగతా ఆలయాలకు ఆదర్శంగా నిలిచింది. దీంతో తెలంగాణ ధర్మాదాయ శాఖ కూడా అడుగు వేసింది. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని గుళ్లలో ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటించింది.
నగదు రహిత హుండీ ద్వారా ఆలయంలో హుండీ చోరీలు జరగకుండా ఆపోచ్చని అధికారులు అంటున్నారు. జరుగుతున్న హుండీ చోరిలను దృష్టిలో పెట్టుకొని ఈ వినూత్న ప్రయోగం చేశారని అధికారులు తెలిపారు. గతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో గర్భ గుడిలోని హుండీని దొంగల తొమ్మిది మంది సభ్యుల ముఠా చోరికి పాల్పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ భారీ చోరీలో హుండీలో ఉన్న కానుకలను ముఠా దొంగలించింది. అయితే ఈ డిజిటల్‌లో కానుకలను చెల్లించడం ద్వారా ఆలయాల్లో చోరీలు జరిగే అవకాశం ఉండదని కోటిలింగాల దేవాలయని వచ్చే భక్తులు అంటున్నారు.
Also Read: Women's IPL: వచ్చే ఏడాది 6 జట్లతో ఐపీఎల్.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook