Nandamuri Balakrishna on Mannava Balayya: టాలీవుడ్ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య మరణం తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలయ్య మరణంపై తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. బాలయ్య మరణం తననెంతగానో కలచివేసిందన్నారు. ఆయన అద్భుతమైన నటుడని కొనియాడారు. ఈ మేరకు బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
'సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు. నాన్నగారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండ నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య గారు తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురద్రుష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అని బాలకృష్ణ పేర్కొన్నారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తన స్వగృహంలో మన్నవ బాలయ్య (92) తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లాలోని చావుపాడు గ్రామంలో 1930, ఏప్రిల్ 19న బాలయ్య జన్మించారు. దురదృష్టవశాత్తు పుట్టిన రోజు నాడే ఆయన కన్నుమూయడం విషాదం. ఇంజనీరింగ్ చదివిన బాలయ్య నటనపై ఆసక్తితో చెన్నై చేరారు. దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు. నటుడి గానే కాదు, రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతగా దాదాపు 10 చిత్రాలు, దర్శకుడిగా 3 చిత్రాలు చేశారు. రచయితగా ఐదు చిత్రాలకు పనిచేశారు. మన్నవ బాలయ్య మరణంపై బాలకృష్ణ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Actor, MLA #NandamuriBalakrishna expressed his deepest condolences on the sudden demise of Veteran actor Shri #Balayya garu. pic.twitter.com/lI10d3ilM2
— BA Raju's Team (@baraju_SuperHit) April 9, 2022
Also Read: Acharya Pre-Release Date: ఆచార్య మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ముఖ్యఅతిథిగా పవన్ స్టార్?
Also Read: Malavika Mohanan Photos: మోడ్రన్ డ్రస్సులోనే కాదు చీరకట్టులోనూ ఈమె అందానికి దాసోహమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook