Sea Monster Video: నీటి అడుగున భయంకరమైన జీవి- చూస్తే చెమటలు పట్టడం ఖాయం!

Sea Monster Video: యానిమేషన్ మూవీస్ లో లేదా కార్టూన్స్ లో చూసే భయంకరమైన ఓ జలచరం ఇప్పుడు అమెరికాలో బయటపడింది. ఉత్తర అమెరికాలోని ఓ నదిలో 100 ఏళ్ల నాటి ఓ భయంకరమైన నీటి జీవి ప్రజల కంట పడింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 06:42 PM IST
Sea Monster Video: నీటి అడుగున భయంకరమైన జీవి- చూస్తే చెమటలు పట్టడం ఖాయం!

Sea Monster Video: మీ జీవితకాలంలో మీరు ఎన్నో యానిమేషన్స్, కార్టూన్స్ వంటివి ఎన్నో చూసుంటారు. అందులో నీటి కింద ఉండే భయంకరమైన జీవులను తెరపై చూసి ఉంటారు. కానీ, అలాంటి భయంకరమైన జలచరాలను ఎప్పుడైనా నిజజీవితంలో చూశారా? అవును, మీరు విన్నది నిజమే! ఓ భయంకరమైన నీటి మాన్ స్టర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటో మీరూ చూసేయండి. 

భయంకరమైన నీటి జీవి!

ఉత్తర అమెరికాలోని ఓ నదిలో భయంకరమైన నీటి జీవి ఉంది. ఆ నదిపై వెళ్తోన్న ఓ పడవను తరుముతూ ఉంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. దాని శరీరాకృతిని చూస్తే ప్రజలంతా భయపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్‌కి ఇప్పటివరకు 3.8 మిలియన్ల వ్యూస్ తో పాట 122 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

అయితే అలాంటి నీటి జీవుల జాతి కెనడాలోని బెలూగా స్టర్జన్, వైట్ స్టర్జన్‌కు చెందినదిగా తెలిసింది. ఆ వీడియోలో కనిపించిన జలచర పొడవు ఎంతఉందో అర్థం కాలేదు. కానీ, దాని పరిమాణాన్ని బట్టి అది 100 ఏళ్ల వయసు గలదని స్థానిక అధికారులు అంచనాకు వచ్చారు. ఇవి వందేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించగలవని.. దాదాపు 100 కిలోల బరువు ఉంటాయని తెలిపారు.  

Also Read: Suicide in Metro Station: మెట్రో స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడిన యువతి.. వీడియో వైరల్!

Also Read: Tricky Question: ఈ చిత్రంలో ఉన్న గ్లాసుల్లో ఏది త్వరగా నీటితో నిండిపోతుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News