Pawan Kalyan visit : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. అధికార ప్రకటన చేసిన జనసేన పార్టీ.!

Pawan Kalyan visit : ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు ఆపార్టీ నుంచి అధికార ప్రకటన వెలువడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 05:46 PM IST
  • తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన
  • పర్యటనపై అధికార ప్రకటన చేసిన పార్టీ
  • రైతు భరోసా యాత్రలో భాగంగా పర్యటన
Pawan Kalyan visit : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. అధికార ప్రకటన చేసిన జనసేన పార్టీ.!

Pawan Kalyan visit : ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు ఆపార్టీ నుంచి అధికార ప్రకటన వెలువడింది. తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని అంచనా వేస్తున్న ఆపార్టీ నేతలు త్వరలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రైతు భరోసా యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ .... ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. అదే మాదిరిగా ప్రమాదవశాత్తు చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాల పరామర్శతో తెలంగాణ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయాలని భావిస్తున్నారు. త్వరలో హుజూర్ నగర్ తో పాటు చౌటుప్పల్ ఆయన పర్యటన ఉంటుందని జనసేన ప్రకటించింది. 

రైతు భరోసా యాత్రలో భాగంగా రైతు సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్...  ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే  రాష్ట్రంలో 1019 మంది , 2వ  ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ ఆరోపించారు.  ప్రభుత్వ చేతకాని తనం కారణంగా రైతాంగ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రటించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.  పంటకు పెట్టుబడి ఇవ్వడంతో పాటు రైతులకు రుణాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే.... పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని నమ్మి జనసేనతో ఇంత కాలం ప్రయాణించి  ప్రమాదవశాత్తు చనిపోయిన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారని జనసేన ప్రకటించింది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకొవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని తెలిపింది.  జనసేన పార్టీకి తెలంగాణలో బలం లేదన్న వాదనలను తిప్పికొట్టే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఆ పార్టీ. జనసేకరణ నుంచి ప్రెస్ మీట్ల వరకు అన్ని రకాలుగా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోంది. పవన్ కళ్యాణ్ కు యువత పెద్ద ఎత్తున ఆకర్శితులయ్యే అవకాశం ఉండడంతో వారి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరో వారం పది రోజుల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది.

Also Read: KGF 2 Movie Scenes: 'ఇంద్ర' సినిమాలోని సన్నివేశాన్ని కాపీ కొట్టిన 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్?

Also Read: Telangana Congress Leaders: రాహుల్ టూర్ ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News