Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ తదుపరి టార్గెట్ కర్ణాటకే, ఇవాళ విభిన్న వర్గాలతో సమావేశం

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ నెక్ట్స్ టార్గెట్ మారింది. కర్ణాటకపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పెడుతున్నారు. ఇవాళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. టార్గెట్ 2023 దిశగానే ఈ పర్యటన ఉందని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2022, 08:54 AM IST
  • ఢిల్లీ, పంబాజ్ తరువాత ఇప్పుడు కర్ణాటకపై దృష్టి
  • ఇవాళ కర్ణాటకలో కేజ్రీవాల్ పర్యటన, బెంగళూరులో రైతులు, మహిళలు, యువతతో కీలక సమావేశం
  • టార్గెట్ 2023 లక్ష్యంగా కర్ఠాటకపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ తదుపరి టార్గెట్ కర్ణాటకే, ఇవాళ విభిన్న వర్గాలతో సమావేశం

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ నెక్ట్స్ టార్గెట్ మారింది. కర్ణాటకపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పెడుతున్నారు. ఇవాళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. టార్గెట్ 2023 దిశగానే ఈ పర్యటన ఉందని తెలుస్తోంది. 

ఆమ్ ఆద్మీ పార్టీ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఢిల్లీలో వరుసగా మూడుసార్లు పాలన పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్..ఇప్పుడు పొరుగున ఉన్న పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో పోటీ చేసినా..పంజాబ్ తప్ప మరెక్కడా సత్తా చాటలేకపోయింది. గోవాలో గెలిస్తే..దక్షిణాదిన విస్తరించవచ్చనేది అరవింద్ కేజ్రీవాల్ ఆలోచన. అయితే అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు కర్ణాటకపై దృష్టి సారించింది. 

కర్ణాటక ఎందుకు

కర్ణాటకలో వచ్చే ఏడాది అంటే 2023లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పుడక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీకు సమాంతరంగా బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ బలహీనమౌతోంది. అంటే రెండు జాతీయ పార్టీలకు దక్షిణాదిన బలముంది ఇక్కడే. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కొత్త పార్టీలకు మనుగడ కష్టమే. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకను టార్గెట్ చేసింది. దీంతోపాటు 2022 చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఇప్పుడు కర్ణాటక టార్గెట్ చేస్తే దక్షిణాదికి శ్రీకారం చుట్టాలనేది అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం. ఇందులో భాగంగానే కర్ణాటకకు చేరుకున్నారు. ఇవాళ అక్కడ జరగనున్న ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అంతేకాకుండా రైతులు, మహిళలు, యువకులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర యూనిట్ నేతలతో కూడా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం బెంగళూరులోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్‌లో జరగనుంది. 

Also read: PM Modi-Tedros: WHO బాస్​కు కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ.. ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News