Todays Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొద్దికాలంగా పెరుగుతున్న బంగారం తగ్గడంతో బంగారం ప్రియులు ఊపిరిపీల్చుకున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్. వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దికాలంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశంలో ఇవాళ మాత్రం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దేశంలో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 370 రూపాయలుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 370 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 370 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 370 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 370 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో మాత్రం అన్నింటికంటే ఎక్కువగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 5 వందలు కాగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 9 వందలుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 370 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 370 రూపాయలుంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Also read: Tata Motors New Ev Launch : లాంఛ్‌కు రెడీ అయిన టాటా మోటార్స్ సరికొత్త ఈవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.