Talasani Srinivas Yadav: కేటీఆర్ వ్యాఖ్యలపై ఎందుకంత ఉలికిపాటు... బొత్సకు తలసాని కౌంటర్..

Talasani counter to AP Minister Botsa Satyanarayana: కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని రియాక్ట్ అయ్యారు. బొత్స వ్యాఖ్యలను తలసాని తప్పు పట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 02:27 PM IST
  • ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి తలసాని కౌంటర్
  • ఎందుకంతలా ఉలికిపడుతున్నారని ప్రశ్నించిన తలసాని
  • ఏపీలో అభివృద్ది బాగుంటే సంతోషమని కామెంట్
Talasani Srinivas Yadav: కేటీఆర్ వ్యాఖ్యలపై ఎందుకంత ఉలికిపాటు... బొత్సకు తలసాని కౌంటర్..

Talasani counter to AP Minister Botsa Satyanarayana: మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు ఏపీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. మంత్రి బొత్స సత్య నారాయణ అసలు హైదరాబాద్‌లోనే కరెంట్ సరిగా ఉండట్లేదంటూ కామెంట్స్ చేశారు. బొత్స వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకంతలా ఉలికిపడుతున్నారంటూ ఏపీ మంత్రులను తలసాని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోనే కరెంట్ లేదంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు సరికాదు. అదే నిజమైతే... హైదరాబాద్‌లోనే ఫంక్షన్లు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో  మౌలిక సదుపాయాల కల్పన బ్రహ్మండంగా జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. 

తామేమీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ కాదని... టీడీపీపై మాట్లాడినట్లే తమపై కూడా అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నారని తలసాని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి తెలంగాణ కన్నా మెరుగ్గా ఉంటే సంతోషమన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్ల అవసరమే లేకుండా పోయిందన్నారు.

కాగా, తన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో కేటీఆర్ వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. అన్యాపదేశంగా తాను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని కొంతమంది మిత్రులకు బాధ కలిగించాయని... సీఎం జగన్‌ను తాను సోదర సమానుడిగా భావిస్తానని... ఆయన నాయకత్వంలో ఏపీ పురోగతి చెందాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. 

అంతకుముందు, క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న సందర్భంగా పక్క రాష్ట్రంలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయంటూ తన మిత్రుడొకరు వాపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. అక్కడ కరెంట్, నీళ్లు, రోడ్లు సరిగా లేవని చెప్పారన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. పక్క రాష్ట్రమంటూ కేటీఆర్ పరోక్షంగా ఏపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో... ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో కేటీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

Also Read: Minister KTR on AP: ఏపీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వివరణ... ఏం చెప్పారంటే...

Also Read: Malladi Vishnu: హైదరాబాద్‌కి కల్చర్ నేర్పిందే మేము... కేటీఆర్ కామెంట్స్‌పై మల్లాది విష్ణు కౌంటర్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News