Vitamin D Deficiency Symptoms: శరీరానికి విటమిన్లు ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. అరోగ్యంగా ఉండేందుకు, జ్ఞాపక శక్తిని పెంచేందుకు మంచి ఆహారాన్ని తినడం ఎంతో అవసరం. ముఖ్యంగా సూర్య కాంతి ద్వారా వచ్చే విటమిన్ మానవ శరీరానికి ఎంతో కీలకమైనది. విటమిన్ డి గురించి మాట్లాడుకున్నట్లైతే..ఇవి పోషకాహారం తీసుకోవటం వల్ల శరీరానికి లాభాలు చేకూర్చుతాయని రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో, ఆధునిక జీవనశైలిలో చాలా ముఖ్యమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి పోషకాలు అందకపోతే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.
విటమిన్ డి లోపాన్ని ఎలా గుర్తించాలి (Symptoms of Vitamin D Deficiency):
#ఎప్పుడూ అలసటగా అనిపించడం
#ఎముకలు, కీళ్లలో నొప్పి
#తీవ్రమైన వెన్నునొప్పి
#గాయాన్ని త్వరగా నయం కావాడం.
#వేగంగా జుట్టు నష్టం
#టెన్షన్‌కు గురికావడం
విటమిన్ డి లోపానికి కారణాలేంటి.? (Causes of Vitamin D Deficiency):
ఆరోగ్యకరమైన ఆహారాలకు బదులుగా బయట లభించే శరీరానికి నష్టం కలిగించే ఆహారం తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం తప్పదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిని నివారించడానికి పగటిపూట ఎండలో కొంత సమయం గడపడం చాలా మంచిదని సూచించారు. అంతే కాకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ డి పొందడానికి ఈ ఆహారం తీసుకోండి:
1. సోయాబీన్ (Soybean)
సోయాబీన్స్‌లో విటమిన్ డి తో పాటు...ప్రోటీన్, విటమిన్ బి, ఫోలేట్, జింక్, సెలీనియం, కాల్షియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకల వ్యాధుల సమస్యలను తగ్గిస్తుంది.
2. పాలు (Milk)
పాలు మంచి పోషకాలను కలిగి ఉంటుంది. కాబట్టి పాలను పూర్తి ఆహారంగా పరిగణించవచ్చు. పాలు తాగడం వల్ల విటమిన్ డి, కాల్షియం లోపాన్ని తీర్చి, ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి తోడ్పడుతుంది.
3. గుడ్డు (Egg)
విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి.. ఉదయం అల్పాహారంలో గుడ్లు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోటీన్, కాల్షియం శరీర అభివృద్ధికి అవసరమైన సహజ కొవ్వును కలిగి ఉంటుంది.
4. బచ్చలికూర (Spinach)
విటమిన్ డి లోపాన్ని తీర్చే ఆకు కూరలలో బచ్చలికూర ఉత్తమమైన ఆహారమని వైదులు తెలిపారు. దీన్ని రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచింస్తున్నారు.
5. చీజ్ (Cheese)
పాల ఉత్పత్తులలో చీజ్ ఎంతో ముఖ్యమైన పదార్థం దీనిని పలు కూరల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకలకే కాకుండా కండరాలకు మంచి బలాన్నిస్తుంది.
Also Read: F3 Movie Trailer: మరోసారి ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో వెంకటేష్, వరుణ్ తేజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)