Betel Leaves Fitness Tips: మీరెప్పుడైనా తమలపాకు నమిలి తిన్నారా? దీనిని తినడం ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

Betel Leaves Fitness Tips: తమలపాకుల(Betel Leaves)ని వివాహాం, పూజ కార్యక్రమంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్య వివాహా కార్యక్రమంలో విందు అనంతరం స్వీట్‌పాన్‌లను కూడా అందిస్తున్నారు. దీంతో తమలపాకు వినియోగం పెరిగిపోంతోంది. దీనిని నమిలి తింటే శరీరం దృఢంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 10:59 AM IST
  • తమలపాకుతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు
  • జీర్ణక్రియను ఆరోగ్యకరంగా చేస్తుంది
  • నోటి దుర్వాసను కూడా తొలగిపోతుంది
Betel Leaves Fitness Tips: మీరెప్పుడైనా తమలపాకు నమిలి తిన్నారా?  దీనిని తినడం ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

Betel Leaves Fitness Tips: తమలపాకుల(Betel Leaves)ని వివాహాం, పూజ కార్యక్రమంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్య వివాహా కార్యక్రమంలో విందు అనంతరం స్వీట్‌పాన్‌లను కూడా అందిస్తున్నారు. దీంతో తమలపాకు వినియోగం పెరిగిపోంతోంది. దీనిని నమిలి తింటే శరీరం దృఢంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆకులను తినడం ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకులు నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు (Betel Leaves  Benefits):

తమలపాకు లోపల యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. దీనిని తినడం ద్వారా దగ్గు సమస్యలు తగ్గిపోవడమే కాకుండా..గొంతులో వ్యర్థాలు శుభ్రమవుతాయి. ఈ ఆకును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని పేర్కొన్నారు. తమలపాకును నమలడం వల్ల నోటి దుర్వాసను కూడా తొలగిస్తుందని..నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని వారు తెలుపుతున్నారు. అంతేకాకుండా చిగుళ్ళలో నొప్పి లేదా వాపులు ఉంటే దీనిని తినడం ద్వారా తొలగిపోతాయని..చిగుళ్లలో మంటను నిరోధించడానికి కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

వేసవిలో తమలపాకులు తినొచ్చా..?

తమలపాకులో శరీరానికి వేడి చేసే గుణాలుంటాయి. కావున వేసవిలో వీటిని తినకపోవడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు. గొంతులో ఏదైనా సమస్యలుంటే వేసవిలో కూడా తినొచ్చని వారు తెలుపుతున్నారు. ఈ ఆకులను తినడానికి ముందు బాగా నీటిలో శుభ్రం చేస్తే శరీరాని మంచి లాభాలుంటాయని అంటున్నారు.

Also Read: Weight Loss Drinks At Home: లెమన్ వాటర్‌ను తాగుతున్నారా..అయితే ఈ ప్రయోజనాన్ని తెలుసుకోండి..!!

Also Read: Hyderabad Honour Killing: బేగంబజార్ హత్య కేసు నిందితులు అరెస్ట్! కర్ణాటకలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News