Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహంతోనే పరాచకాలా.. చేతి వేలిని పిప్పి చేసిన మృగరాజు

Video of Lion Chews Mans Finger: సింహంతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఓ వ్యక్తికి ప్రాక్టికల్‌గా తెలిసొచ్చింది. దానితో పరాచకాలకు దిగిన ఆ వ్యక్తి వేలిని సింహం పిప్పి చేసేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 10:20 PM IST
  • సింహం నోట్లో చేయి పెట్టి పరాచకాలు
  • క్రూర జంతువుతో కవ్వింపు చర్యలకు ఫలితం అనుభవించిన వ్యక్తి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. సింహంతోనే పరాచకాలా.. చేతి వేలిని పిప్పి చేసిన మృగరాజు

Video of Lion Chews Mans Finger: బోనులో బంధించినంత మాత్రాన క్రూర జంతువు సాధు జంతువు అయిపోదుగా... ఈ విషయం మరిచిపోయి బోనులో ఉన్న సింహంతో పరాచకాలకు దిగాడో వ్యక్తి. బోనులో చేయి దూర్చి.. సింహం నోట్లో వేళ్లు పెట్టి... దానితో కవ్వింపు చర్యలకు దిగాడు. కాసేపటికే సింహం అతనికి అసలు సినిమా చూపించింది. అతని కుడి చేతి వేలిని కోర పళ్ల మధ్య బిగబట్టి నమిలిపారేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆఫ్రికాలోని జమైకా జూలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అందరి లాగే జూలో జంతువులను చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ బోనులో బంధించి ఉన్న సింహంతో పరాచకాలకు దిగాడు. ఈ క్రమంలో బోనులో చేయి పెట్టి సింహానికి చికాకు తెప్పించేలా చేశాడు. అంతే.. సింహం తన నోటితో అతని వేలిని గట్టిగా బిగబట్టేసింది. సింహం నోటి నుంచి తన వేలిని లాక్కునేందుకు అతను చాలా ప్రయత్నించాడు. కానీ సింహం దెబ్బకు అతని చేతి వేలు దాదాపుగా ఊడిపోయింది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సింహంతో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు. అతను అంతలా విలవిల్లాడుతుంటే పక్కనే ఉన్నవారు సెల్‌ఫోన్లలో వీడియో తీస్తూ ఉండిపోయారు తప్ప అతన్ని లాగే ప్రయత్నం చేయలేదని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకి ఇప్పటివరకూ 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూశాక క్రూర జంతువులతో ఎట్టి పరిస్థితుల్లోనూ చిలిపి చేష్టలకు, పరాచకాలకు దిగవద్దనే విషయం చాలామందికి అర్థమై ఉంటుంది.

Also Read: Rahul Gandhi: పెట్రోల్ ధరల తగ్గింపు కేవలం కంటితుడుపు చర్యే..రాహుల్ గాంధీ ఆగ్రహం..!

Also Read: Rishab Pant: ఇదేంది పంతూ... చేసిందంతా చేసి టీమ్ మేట్స్‌ను నిందిస్తావా... రిషబ్ పంత్‌పై నెటిజన్ల ట్రోలింగ్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News