Flax Seeds Benefits: మధుమేహంతో బాధపడుతున్నారా..అయితే అవిసె గింజలను ట్రై చేయండి..!!

Flax Seeds Benefits: ఎండల కారణంగా ప్రస్తుతం భారత్‌లో చాలా చోట్ల వేడి వాతావరణం నెలకొని ఉంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతోంది. ఈ ఎండల కారంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2022, 12:38 PM IST
  • మధుమేహంతో బాధపడుతున్నారా..
  • అవిసె గింజలను ట్రై చేయండి
  • మధుమేహం నుంచి విముక్తి పొందుతారు
Flax Seeds Benefits: మధుమేహంతో బాధపడుతున్నారా..అయితే అవిసె గింజలను ట్రై చేయండి..!!

Flax Seeds Benefits: ఎండల కారణంగా ప్రస్తుతం భారత్‌లో చాలా చోట్ల వేడి వాతావరణం నెలకొని ఉంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతోంది. ఈ ఎండల కారంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా ఉంచుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని రకాల గింజలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహ రోగులకు అవిసె గింజలు:

అవిసె గింజలు డయాబెటిక్ రోగులకు ఓ మంచి ఔషధంలా పని చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా..డయాబెటిక్‌ని  నియంత్రిస్తుంది.

అవిసె గింజలలో పోషకాలు:

అవిసె గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఈస్ట్రోజెన్, లిగ్నాన్స్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలను ఉంటాయి.

రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది:

డయాబెటిక్ రోగులు అవిసె గింజలను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు టైప్ 2 డయాబెటిస్, బ్లడ్ షుగర్ లెవెల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది:

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే.. మధుమేహకి దారి తీస్తుంది. ఎందుకంటే ఇది గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్. ) ప్రమాదాన్ని పెంచుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Vitamin D Benefits: విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి..!!

Also Read: Benefits Of Khus Water: వట్టివేరు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News