Jackfruit Disadvantages: పనసపండు అంటే చాలా మందికి ఇష్టం. ఆ పండు పేరు చెప్పగానే కొందరికి నోరు ఊరుతుంది. ఇటీవలే కాలంలో ఈ పండును మార్కెట్ అధికంగా విక్రయిస్తున్నారు. అయితే చాలా మందికి ఈ పండు వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనాలు తెలియవు..! జాక్‌ఫ్రూట్‌ను తిన్న తర్వాత కొందరు వెంటనే తినకూడని కొన్ని ఆహారాలాను తింటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని పాడుచేసే అంశాలు ఏమిటో తెలుసుకుందాం..
పాలు తాగకూడదు:
చాలా మంది జాక్‌ఫ్రూట్‌ను తిన్నాక రాత్రిపూట వెంటనే పాలు తాగుతారు. కానీ ఇలా ఎట్టి పరిస్థితులలో అలా చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మ సంబంధిత సమస్య రావచ్చని వారు చెబుతున్నారు. అంతేకాకుండా మొటిమలు, అలర్జీ రావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత తేనెను అస్సలు వాడకూడదు:
పనసపండు తిన్న తర్వాత తేనెను కూడా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెరిగే అవకాశాలున్నాయని వారు తెలుపుతున్నారు.
బొప్పాయికి దూరంగా ఉండండి:
జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత బొప్పాయి పండును అస్సలు తినకూడదు. ఇలా తింటే జీర్ణం క్రియ దెబ్బతినే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read Fennel Oil For White Hair: సోపు నూనె వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook