Samsung Galaxy M52 Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జి స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 30 శాతం డిస్కౌంట్‌తో లభ్యమౌతోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జి స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది 29 వేల 999 రూపాయలకు లాంచ్ అయింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే, ట్రిపుల్ రేర్ కెమేరాతో వస్తోంది. ఆక్టాకేర్ క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 778 జి ప్రోసెసర్ కలిగి ఉంది. ఐక్యూ జెడ్5, రియల్‌మి జిటి మాస్టర్ ఎడిషన్ అదనపు ఫీచర్లుగా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జి పై కంపెనీ 30 శాతం డిస్కౌంట్ ప్రకటించగా..ప్రస్తుతం ఇండియాలో 20 వేల 999 రూపాయలకు లభ్యమవుతోంది. ఈ ఫోన్ 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉంది. రిలయన్స్ డిజిటల్‌లో పరిమితమైన ఆఫర్‌లో భాగంగా ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటివరకూ ఉంటుందో ఇంకా తెలియదు. రిలయన్స్ డిజిటల్ మరో ఆఫర్ ఇస్తోంది. సిటి బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా పది శాతం డిస్కౌంట్ ఉంది. ఇండస్ట్రియల్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐలో కొనుగోలు చేస్తే..15 వందల రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది.
ఈ 30 శాతం ఆఫర్ కేవలం రిలయన్స్ డిజిటల్‌పై మాత్రమే ఉంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లపై ఈ ఫోన్ ఇప్పుడు 24 వేల 999 రూపాయలకు లభిస్తోంది. ఇండియాలో ఈ ఫోన్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో బ్లాక్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఏప్రిల్ నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జి మరో ఫోన్ కూడా లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర 26 వేల 499 రూపాయలు.
Samsung Galaxy M52 5G ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ నానో డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో 6.7 ఫుల్ హెచ్‌డి సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్మాప్ డ్రాగన్ 778 జి ఫీచర్ కలిగి ఉంది. అంతేకాకుండా 8జీబీ ర్యామ్‌తో వేగంగా పనిచేస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.శాంసంగ్ ఎం52 5జి లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. 128 జీబీ స్టోరేజ్ ఉండటమే కాకుండా 1 టీబీ వరకూ పెంచుకునే సామర్ధ్యం కలిగి ఉంది. మరోవైపు 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంది.
Also read: Best smartphone offers: 29వేల స్మార్ట్‌ఫోన్ వేయి రూపాయలకే, ఆఫర్లు, ఫీచర్లు ఇవే
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.