CM Kcr on PM Modi: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క బీజేపీ కార్యవర్గ సమావేశాలు..మరో పక్క విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో పాలిటిక్స్ మారిపోయాయి. యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ ఘనంగా స్వాగతం పలికింది. ఆయన కోసం జలవిహార్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీయే టార్గెట్‌గా పలు ప్రశ్నలు సంధించారు.
రెండురోజులపాటు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ఉండబోతున్నారని..బహిరంగసభలో తమపై మరోసారి విమర్శలు చేయబోతున్నారని తెలిపారు. అంతకంటే ముందు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. రైతులు మీకు ఉగ్రవాదులగా..వేర్పాటు వాదులగా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు. ఎన్నికలప్పుడే మోదీకి ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు.
మోదీ తనకు తాను మేధావిగా భావిస్తున్నారని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో ఎరువులు, నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని గుర్తు చేశారు. రైతు చట్టాలు సరైనవే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మోదీ ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read:Budhaditya Yog 2022: బుధాదిత్య యోగం.. ఇవాళ్టి నుంచి ఈ 3 రాశుల వారి దశ తిరిగినట్లే..
Also read:Nani's Dasara Movie : ఇదేదో తేడాగా ఉందే.. కొత్త అనుమానాలు మొదలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook