Trending Video: ధూమ్ తరహాలో రెచ్చిపోయిన ప్రేమ జంట.. క్లైమాక్స్ మామూలుగా లేదంట..!

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 02:13 PM IST
  • అబ్బాయి, అమ్మాయి బైక్ వీడియో
  • నెట్టింట విపరీతంగా వైరల్
Trending Video: ధూమ్ తరహాలో రెచ్చిపోయిన ప్రేమ జంట.. క్లైమాక్స్ మామూలుగా లేదంట..!

Viral Video today: సాధారణంగా అమ్మాయి మన బైక్ ఎక్కిందంటే చాలు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. అప్పటికప్పుడు హీరోలా ఫీలై పోయి స్టంట్స్ చేస్తాం. ఎవరేం చెప్పినా పట్టించుకోం. బిల్డప్ ఇస్తూ బైక్ పై రైడ్స్ కొడుతాం. ఈ మధ్య అబ్బాయిలు, అమ్మాయిలు పబ్లిక్ లో ట్రెండ్ పేరుతో ఇష్టమెుచ్చిన పనులు చేస్తున్నారు. కామన్స్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. నలుగురు ఏమనుకుంటారనే భయం కూడా వారికి లేదు. తాజాగా అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తుండగా..బైక్ పై అమ్మాయి ఎదురుగా హత్తుకుని మరి కూర్చుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ (Viral Video)గా మారింది. 

వీడియో ఓపెన్  చేస్తే... ఇందులో అమ్మాయి, అబ్బాయి బైక్ పై వెళ్తుంటారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని ముందు కూర్చోమంటాడు. ఆ యువతి ఓకే అంటూ ముందు కూర్చుంటుంది. అక్కడ నుంచి మనవాడు డ్రైవింగ్ రేస్ ను తలపిస్తుంది. యమ స్పీడ్ గా దూసుకుపోతాడు. చివరకు వీరికి ఊహించిన ట్విస్ట్ ఎదురువుతుంది. పోలీసులు వీరిని అడ్డుకుని ఫైన్ కట్టించుకోవడంతోపాటు వారిని మందలించడం చూడవచ్చు. సినిమాల ప్రభావమో, ఫారిన్ కల్చర్ వ్యామోహమో తెలియదు కానీ యువతీ యువకులు ఇలా ప్రవర్తించడం సరికాదని ప్రస్తుత వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by punjabi industry (@punjabi_industry__)

Also Read: Viral Video: ఒక్క సెకన్ తేడాలో..మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నాడో..వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News