Happy Birthday Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 41వ పుట్టిన రోజు నేడు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ధోనీ భార్య సాక్షి, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ధోనీ బర్త్ డే వేడుకల్లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ రిషబ్ పంత్ కూడా పాల్గొనడం విశేషం. ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోని ఆయన భార్య సాక్షి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
బర్త్ డే వేళ ధోనీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి విషెస్ పోటెత్తుతున్నాయి. క్రికెట్‌లో ధోనీ స్పెషల్ మూమెంట్స్‌ని షేర్ చేస్తూ నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. క్రికెట్‌లో ధోనీ రికార్డులను, ధోనీ వచ్చాక టీమిండియా సాధించిన విజయాలను మరోసారి గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #HBDMSDhoni హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
టీమిండియా కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చెరిగిపోని ముద్ర వేశాడు. ఒకరకంగా ధోనీకి ముందు ధోనీ తర్వాత అనేంతగా టీమిండియాపై ధోనీ ప్రభావం ఉంది. మైదానంలో ధోనీ నాయకత్వ లక్షణాలు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా వ్యవహరించే తీరు కెప్టెన్‌గా ధోనీని ప్రత్యేకంగా నిలిపాయి. కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ధోనీ ఆ బాధ్యతలకే వన్నె తెచ్చాడంటే అతిశయోక్తి కాదు.
కెప్టెన్ కూల్ మైదానంలో ఉన్నాడంటే జట్టుకు గొప్ప భరోసా. అతను క్రీజులో ఉన్నాడంటే చివరి బంతికైనా విజయం సాధిస్తామనే నమ్మకం. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై ధోని బాదిన విన్నింగ్ సిక్సర్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. నాయకుడిగా ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టాడు. టీమిండియాకు 3 ఐసీసీ టోర్నీలు సాధించిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం విశేషం. ఆగస్టు 15, 2020న ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుని రెండేళ్లు గడుస్తున్నా ధోనీ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook