Kodi Kathi Case: కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడిని తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్ల నుంచి తన కుమారుడు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారని తెలిపారు. ఈకేసులో న్యాయస్థానం, ఎన్‌ఐఏ ఎలాంటి విచారణ చేయడం లేదని లేఖలో స్పష్టం చేశారు.
ఈక్రమంలోనే తన కుమారుడిని విడుదల చేయాలన్నారు. గత ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్..హైదరాబాద్‌కు వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో దూసుకొచ్చిన ఓ యువకుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో దాడికి యత్నించాడు.
ఈ ఘటనలో జగన్‌కు గాయమైంది. అప్పట్లో ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కేసు విచారణ ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. అప్పటి అధికార పార్టీ టీడీపీయే చేయించిందని వైసీపీ ఆరోపించింది. ఎన్నికల్లో సింపతి కోసమే వైసీపీ పన్నాగం పన్నిందని టీడీపీ విమర్శించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది.
Also read:Telugu States Rains Live Updates: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.