RAHUL WITH TRS MPS:టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ధర్నా.. తెలంగాణ రాజకీయాల్లో కాక

RAHUL WITH TRS MPS: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. త్రిముఖ పోరు హోరోహోరీగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ, కాంగ్రెస్ చెబుతున్నాయి. ఈ విషయంలో దూకుడుగా వెళుతున్నాయి రెండు పార్టీల లీడర్లు. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలున్నాయని కాంగ్రెస్ చెబుతోంది.

Written by - Srisailam | Last Updated : Jul 20, 2022, 03:46 PM IST
  • పార్లమెంట్ సాక్షిగా ఆసక్తికర సన్నివేశం
  • టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి రాహుల్ ధర్నా
  • తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం
RAHUL WITH TRS MPS:టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ధర్నా.. తెలంగాణ రాజకీయాల్లో కాక

RAHUL WITH TRS MPS: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. త్రిముఖ పోరు హోరోహోరీగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ, కాంగ్రెస్ చెబుతున్నాయి. ఈ విషయంలో దూకుడుగా వెళుతున్నాయి రెండు పార్టీల లీడర్లు. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. టీఆర్ఎస్ తో తమకు ఇకపై ఎలాంటి డీల్స్ ఉండవని వరంగల్ రైతు గర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పదేపదే ఈ విషయమే చెబుతున్నారు. ఇటీవల విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చినా కాంగ్రెస్ నేతలు కలవలేదు. యశ్వంత్ సిన్హా తమ అభ్యర్థే అయినా.. కేసీఆర్ ను కలిశారు కాబట్టి తాము కలవబోమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరూ కలవొద్దని కూడా ఆర్డర్ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ ఇకపై ఎలాంటి వేదికలు పంచుకోదని అంతా భావించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు ఇలా ఉంటే ఢిల్లీలో మాత్రం సీన్ మరోలా ఉంది. టీఆర్ఎస్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి సిన్హా నామినేషన్ సమయంలో కేటీఆర్ తో కలిసి రాహుల్ గాంధీ హాజరయ్యారు. అప్పుడే కాంగ్రెస్, టీఆర్ఎస్ బంధంపై చర్చలు జరిగాయి. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోయాయంటూ కామెంట్లు చేశారు. అయితే కేటీఆర్ తో రాహుల్ మాట్లాడలేదని, కనీసం ఆయన వైపు కూడా చూడలేదని టీపీసీసీ నేతలు కవరింగ్ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగానే ఢిల్లీలో  పార్లమెంట్ సాక్షిగా  మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీఆర్​ఎస్, కాంగ్రెస్​  పార్టీలు ఒకే వేదిక పంచుకున్నాయి.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా  పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ,  సీనియర్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే, ఎన్సీపీ ఎంపీలు, ఎన్సీపీ ఎంపీలు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్, పాల ప్యాకెట్లు, ఇతర నిత్యావసరాలను నేలపై ఉంచి నిరసనకు దిగారు. ధరల పెంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష ఎంపీలు. పార్లమెంట్​ వద్ద చేపట్టిన ఈనిరసనలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కనే టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఉన్నారు . ఈ  సీన్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 

ఇప్పటికే కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ పార్టీలు మిత్ర పక్షాలని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇపుడు గులాబీ పార్టీ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ నిరసనలో  పాల్గొనడం బీజేపీకి అస్త్రంగా మారిందనే వాదన వస్తోంది.  ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటుండగా జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తమకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ నిరసన తెలిపిన అాంశాన్ని బీజేపీ జనంలోకి తీసుకువెళితే తాము ఎలా కౌంటర్ ఇవ్వగలుగుతామని సీనియర్లు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Read aslo : Ambati on Puvvada: భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం కారణమవుతుందా..అంబటి ధ్వజం..!

Read aslo :  Rythu Bheema:తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతు బీమాలో మార్పులకు ఇవాళ ఒక్కరోజే అవకాశం  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News