Here is Monkeypox symptoms, treatment and precautions details: ఇప్పటికే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి కలవరపెడుతోంటే.. దానికి ఇప్పుడు మంకీపాక్స్ వైరస్ కూడా తోడయింది. ఇప్పటికే మంకీపాక్స్ 68 దేశాలలో గుర్తించబడింది. 68 దేశాలలో 16,593 కేసులు నమోదయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక మంకీపాక్స్ వైరస్ భారత్‌కూ విస్తరించింది. మొదటి కేసు కేరళలో నమోదు కాగా.. తాజాగా ఢిల్లీలో మరో కేసు నమోదైంది. మొత్తంగా భారత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు ఉన్నాయా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అనే విషయాలు ఓసారి తెలుసుకుందాం.
మంకీపాక్స్ మొదటి కేసు ఎప్పుడు నమోదైంది?:
1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (అప్పటి జైర్)లో ఓ చిన్న పిల్లాడిలో మంకీపాక్స్ మొదటి కేసు నమోదైంది. అప్పటినుంచి ఆడపాదడపా కేసులు నమోదవులుతున్నాయి. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఇప్పుడు మాత్రం ఆఫ్రికా వెలుపల మునుపటిలా కాకుండా మనుషుల నుంచి మనుషులకు సోకుతూ అంటువ్యాధిగా మారింది. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు పెట్టారు.
తుంపర్లు, లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి:
మంకీపాక్స్ ఒక వైరల్ డిసీజ్. మంకీపాక్స్ స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం కూడా ఉంది. లైంగిక సంపర్కం, తుంపర్లు లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు సోకుతుంది. ఇది మనిషి శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి
లక్షణాలు ఏంటి:
జ్వరం, తలనొప్పి, నడుంనొప్పి, వాపులు, కండరాల నొప్పి, అలసట లాంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు వస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు 6-21 రోజుల్లో బయటపడతాయి. అయితే మైల్డ్ కేసుల్లో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. మంకీపాక్స్ సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. 10 మందిలో ఒకరికి ప్రాణాంతకంగా మారుతుంది.
ట్రీట్మెంట్ లేనప్పటికీ:
మంకీపాక్స్‌కు కచ్చితంగా ఓ ట్రీట్మెంట్ లేనప్పటికీ.. వైద్యులు యాంటీవైరల్ మందులను ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ చికిత్సలో 85% పని చేస్తుంది. యుఎస్ జిన్నెయోస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది. ఇక సామాజిక దూరం, మాస్క్, మెరుగైన వెంటిలేషన్ లాంటివి పాటించాలి.
జాగ్రత్తలు:
మంకీపాక్స్ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండటం ఉండాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం కాదు. ఒకవేళ వెళితే మాస్క్ ధరించి.. ఇంటికి రాగానే స్నానం చేయాలి. ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలి. మాస్క్ తప్పనిసరి.
Also Read: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?
Also Read: Weight Loss: ఈ గ్రీన్ టీని రెగ్యూలర్‌గా తాగడం వల్ల.. 5 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
దేశంలో మంకీపాక్స్ కలకలం.. లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశంలో మంకీపాక్స్ కలకలం
లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే