Monkeypox Symptoms: భారత్‌లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి!

Here is Datails of Monkeypox symptoms and precautions. మనుషులలో మంకీపాక్స్ లక్షణాలు దాదాపుగా చికెన్‌పాక్స్ మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసట అదనపు లక్షణాలు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 26, 2022, 01:11 PM IST
  • దేశంలో మంకీపాక్స్ కలకలం
  • మంకీపాక్స్ లక్షణాలు ఇవే
  • తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Monkeypox Symptoms: భారత్‌లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి!

You Know What is Monkeypox Symptoms: ప్రస్తుతం ప్రపంచ దేశాలను మంకీపాక్స్‌ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 68 దేశాలలో 16,593 మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. భారత్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు కేరళలో నమోదు కాగా.. తాజాగా ఢిల్లీలో మరో కేసు నమోదైంది. ఢిల్లీలో మంకీపాక్స్ సోకిన అతడిని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంకీపాక్స్ వైరస్‌కు మందు లేదని.. చర్మంపై పూయడానికి లోషన్లు, మల్టీ విటమిన్లు ఇస్తున్నామని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. 

చికెన్‌పాక్స్ మాదిరిగానే:
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... మంకీపాక్స్ అనేది వైరస్‌తో సంక్రమించే అరుదైన వ్యాధి. మంకీపాక్స్ వైరస్ పోక్స్విరిడే కుటుంబానికి చెందిన ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. ఆర్థోపాక్స్ వైరస్ జాతిలో వేరియోలా వైరస్, వ్యాక్సినియా వైరస్ మరియు కౌపాక్స్ వైరస్ కూడా ఉన్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రివెన్షన్ ప్రకారం..  మనుషులలో మంకీపాక్స్ లక్షణాలు దాదాపుగా చికెన్‌పాక్స్ మాదిరిగానే ఉంటాయి. అయితే అదనంగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసటగా ఉంటుంది. మంకీపాక్స్ లక్షణాలలో ఇవే ప్రధానమైనవి. 

లక్షణాలు:
ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్ సోకితే 7 నుంచి 14 రోజుల తర్వాత లక్షణాలు ప్రారంభమవుతాయి. జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట మరియు వాపు మంకీపాక్స్‌ సాధారణ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. చికెన్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు వస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు ఒక్కోసారి 7 నుంచి 21 రోజుల్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే మైల్డ్ కేసుల్లో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇక మంకీపాక్స్ వైరస్ సోకిన వారు చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. చాలా తక్కువ మందికి ఇది ప్రమాదకరంగా మారుతుంది. 

నివారించడం ఎలా:
# మంకీపాక్స్‌ వైరస్ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండాలి
# సన్నిహితంగా ఉండడం లేదా శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవద్దు
# మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి యొక్క బెడ్ షీట్లు, తువ్వాళ్లు లేదా బట్టలు వంటి వ్యక్తిగత వస్తువులను తాకవద్దు
# చేతులను సబ్బు లేదా హ్యాండ్ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి
# మంకీపాక్స్‌ సంకేతాలు కనిపిస్తే ఇంట్లోనే ఒంటరిగా ఉండండి
# కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి
# ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలి

Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణ వీడియోలు బయటకు.. బాబు బంగారం అంటూ!

Also Read: Komatireddy:కోమటిరెడ్డి రాజీనామా ఎప్పుడు? ఆయన వ్యూహం ఏంటీ?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News