Shyja Moustache: మీసమున్న మహిళ..  'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..

Kerala Woman Shyja Moustache: సరదాగా మీసాలు పెట్టుకోవడానికి మహిళలు ఇష్టపడుతారేమో కానీ.. నిజంగానే మీసాలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ కేరళకు చెందిన శైజ మాత్రం ఇందుకు భిన్నం.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 27, 2022, 09:19 AM IST
  • మీసం తనకు చాలా ఇష్టమంటున్న కేరళ మహిళ
  • ఐదేళ్లుగా మీసాలతోనే ఆ మహిళ
  • చురకత్తి లాంటి ఆ మీసాలు లేకుండా తన జీవితాన్నే ఊహించుకోలేదట
Shyja Moustache: మీసమున్న మహిళ..  'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..

Kerala Woman Shyja Moustache: అవాంఛిత రోమాలు మహిళలను చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ముఖ్యంగా ముఖంపై అవాంఛిత రోమాలు ఉంటే మహిళలు నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఫీలవుతారు. వాటిని తొలగించుకునేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం, లేదా ఇంట్లోనే తెలిసిన చిట్కాలు పాటించడం చేస్తుంటారు. మహిళలు ఇంతలా ఇబ్బందిపడే అవాంఛిత రోమాలపై ఒక అమ్మాయి స్పందన మాత్రం మరోలా ఉంది. తన పై పెదవిపై ఉన్న అవాంఛిత రోమాలకు తానేమీ సిగ్గుపడట్లేదని.. పైగా నేను దాన్ని చాలా ఇష్టపడుతున్నానని ఆమె చెబుతోంది.

కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన శైజ (35) అనే మహిళకు పై పెదవిపై అవాంఛిత రోమాలు ఉన్నాయి. అచ్చు పురుషులకు ఉన్నట్లే ఆమెకు మీసం కట్టు ఉంది. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ అవాంఛిత రోమాలను శైజ తొలగించాలనుకోలేదు. అప్పటినుంచి ఆమె ఆ అవాంఛిత రోమాలను అలాగే పెరగనిస్తోంది. ఇప్పుడు ఆమె ముఖం చూస్తే అబ్బాయిల లాగే మీసంతో కనిపిస్తోంది. మీసం లేకుండా  తన ముఖాన్ని ఊహించుకోలేనని.. అలా తాను బతకలేనని చెబుతోంది.

మాస్క్ ధరిస్తే తన మీసం కనబడదు కాబట్టి కోవిడ్ సమయంలో మాస్క్ ధరించడాన్ని కూడా తాను ఇష్టపడకపోయేదాన్ని అని ఇటీవల ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ శైజ పేర్కొంది. చాలామంది తన మీసాన్ని తొలగించుకోమని సలహా ఇచ్చారని.. కానీ అందుకు తాను నిరాకరించానని తెలిపింది. మీసం ఉన్నంత మాత్రాన తాను అందంగా కనిపించట్లేదని.. లేదా ఇదేదో ఉండకూడనిదని తానెప్పుడూ భావించలేదని పేర్కొంది. తన కనుబొమ్మలను థ్రెడ్ చేయించుకుంటానని, కానీ మీసాలను మాత్రం తొలగించనని చెప్పింది.

శైజ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. తమ కూతురు మీసంతో బాగుంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కనుబొమ్మలను థ్రెడ్ చేయించుకునే శైజ.. మీసాలు మాత్రం ఎందుకు తొలగించదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శైజ మీసంతో ఉన్న ఫేస్‌బుక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  

Also Read: Electricity Bill: ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది.. షాక్‌తో ఆ వ్యక్తి ఆసుపత్రిపాలు...

Also Read: Komatireddy Rajagopal Reddy: బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్...?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News