Weight Loss Tips: పసుపు..భారతీయుల ప్రతి కిచెన్‌లో ఉండే పదార్ధం. పసుపు కేవలం వంటలకు రుచి కోసమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగించవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టేందుకు పసుపు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
ప్రతి వంటింట్లో తప్పకుండా లభించేది పసుపు. పసుపును పాల నుంచి మొదలుకుని..కూరల వరకూ అన్నింట్లో ఉపయోగిస్తుంటారు. పసుపు వల్ల కూరలకు రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అదే సమయంలో పసుపుతో బరువు కూడా తగ్గవచ్చని మీకు తెలుసా..పసుపుతో ఎలా బరువు తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు మన శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. స్థూలకాయముండేవారికి సాధారణంగా డయాబెటిస్ ముప్పు ఉంటుంది. పసుపు ఉపయోగించడం వల్ల డయాబెటిస్‌కు చెక్ పెట్టడమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కల్గించవచ్చు. పసుపులో ఉండే ఫెనోల్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఒబెసిటీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వైట్ ఎడిపోజ్ టిష్యూలో వాపు తగ్గించేందుకు పనిచేస్తాయి. అందుకే పసుపు వివిధ రకాలుగా సేవించడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతారని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేముందు ఒక గ్లాసు వేడి పాలలో పసుపు కొద్దిగా కలుపుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా..ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. పాలు దాల్చినచెక్కతో టీ చేసుకుని కూడా తాగవచ్చు. ముందుగా ఒక కప్పు నీళ్లలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేసి బాగా ఉడికించాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా పుదీనా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని వడపోసి తాగితే మంచి ఫలితాలుంటాయి. బరువు తగ్గడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
Also read: White Hair Problem: మీ జుట్టు తెల్లబడుతోందా.. అయితే కొబ్బరి, ఉసిరి మిశ్రమంతో 6 వారాల్లో చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook