Flipkart TV Days: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీలపై బంపరాఫర్ ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్' పేరిట పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలపై 70 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా 43 అంగుళాల నోకియా అల్ట్రా హెచ్డీ (4కె) స్మార్ట్ టీవీ చౌక ధరకే అందుబాటులో ఉంది. రూ.40 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.12,999కే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం డిస్కౌంట్ :
43 అంగుళాల నోకియా అల్ట్రా హెచ్డీ (4కె) స్మార్ట్ టీవీ అసలు ధర రూ.40 వేలు. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.23,999కే ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. అంటే.. డిస్కౌంట్ ద్వారా రూ.16,001 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే మరో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందగలరు. అప్పుడు మరో రూ.1199 వరకు ధర తగ్గే అవకాశం ఉంటుంది.
ఎక్స్చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.12,999కే :
43 అంగుళాల నోకియా అల్ట్రా హెచ్డీ (4కె) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ సైట్లో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ద్వారా గరిష్ఠంగా రూ.11 వేల వరకు తగ్గింపు పొందుతారు. తద్వారా రూ.23,999కి అందుబాటులో ఉన్న ఈ టీవీని మరింత చౌకగా కేవలం రూ.12,999కే సొంతం చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్పై వచ్చే తగ్గింపు టీవీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ సేల్ లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఆగస్టు 18 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
నోకియా (43 అంగుళాలు) స్మార్ట్ టీవీ ఫీచర్స్ :
సపోర్టెడ్ యాప్స్ : నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్ అండ్ క్రోమ్ ఇన్‌బిల్ట్)
రిజల్యూషన్ : అల్ట్రా హెచ్’డీ (4కె) 3840 x 2160 పిక్సెల్స్
సౌండ్ అవుట్‌పుట్ : 24 వాట్స్
రీఫ్రెష్ రేట్ : 60HZ
Also Read: Kaushik LM: సినీ పరిశ్రమలో విషాదం.. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి
Also Read: Munugode Byelection: రండి బాబు రండి పార్టీలో చేరితే 10 లక్షలు.. మునుగోడు లీడర్లకు బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook