ATM Transactions: బ్యాంకు ఏటీఎం లావాదేవీలు ఉచితం కాదు. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే జేబులకు చిల్లు పడుతుంది. ఏటీఎం నగదు లావాదేవీలపై పరిమితి, ఛార్జెస్ పూర్తిగా మారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు పెద్ద బ్యాంకులన్నీ ప్రతి నెలా ఏటీఎం లావాదేవీలపై పరిమితి విధించాయి. పరిమితిలోపైతే పూర్తిగా ఉచితం. అంటే నెలకు బ్యాంకును బట్టి 4 లేదా 5 లేదా 6 సార్లు ఏటీఎంల నుంచి నగదు లావాదేవీ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. పరిమితి దాటితే మాత్రం కస్టమర్ల నుంచే వసూలు చేస్తాయి. మీకు ఎక్కౌంట్, డెబిట్ కార్డును బట్టి నెలకు ఎన్ని ఉచితంగా ఉన్నాయనేది ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది జూన్ నెలలో అధికారికంగా బ్యాంకులకు ఇచ్చిన అనుమతి ప్రకారం జనవరి 1, 2022 నుంచి నెలకు ఇచ్చిన పరిమితి దాటి ఏటీఎం లావాదేవీలుంటే..ప్రతి లావాదేవీపై 21 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. గతంలో ఇది 20 రూపాయలుండేది.
మీ బ్యాంకు ఏటీఎం నుంచి నెలకు 5 ఉచిత లావాదేవీలు
కస్టమర్ ప్రతి నెలా తన బ్యాంకు ఏటీఎం నుంచి 5 సార్లు ఉచితంగా లావాదేవీ చేయవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలైతే కేవలం 3 సార్లు ఉచితంగా తీసుకోవచ్చు. మెట్రోయేతర నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు లావాదేవీలు జరపవచ్చు.
ఆగస్టు 1 2022 నుంచి అన్ని కేంద్రాల్లో ప్రతి ఆర్ధిక లావాదేవీపై 17 రూపాయలు, ఆర్ధికేతర లావాదేవీపై 6 రూపాయలు ఇంటర్చేంజ్ ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఏటీఎం ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ కోసం బ్యాంకులు ఏటీఎం సర్వీసు ఛార్జ్ కూడా వసూలు చేస్తున్నాయి.
ఇతర బ్యాంకుల కస్టమర్లు తమ డెబిట్ కార్డుతో ఎస్బీఐ ఏటీఎం నుంచి నిర్ణీత పరిమితి దాటి డబ్బులు డ్రా చేస్తే..ఎస్బీఐ 20 రూపాయలు ప్లస్ జీఎస్టీ ప్లస్ వసూలు చేస్తుంది. అదే బ్యాంకు ఖాతాదార్లకైతే నిర్ణీత పరిమితి దాటితే 10 రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది.
నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు ఎస్బీఐ ఇతర బ్యాంకు కస్టమర్ల నుంచి 8 రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది. అదే బ్యాంకు ఖాతాదార్లనుంచి మాత్రం 5 రూపాయలు ప్లస్ జీఎస్టీ తీసుకుంటుంది. ఒకవేళ ఖాతాలో తగిన డబ్బుల్లేకపోతే ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం, ఇతర ఏటీఎంలపై 20 రూపాయలు ప్లస్ జీఎస్టీ వసూలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే ఆర్బీఐ నెలకు 5 ఉచిత లావాదేవీలకు మాత్రమే అనుమతించింది.
Also read: IRCTC New Updates: రైలు రద్దయితే టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలా, రిఫండ్ ఎంతవస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook