Shoaib Akhtar Sledging Sachin Tendulkar says Virender Sehwag: ప్రపంచకప్ 2003లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ అద్భుత విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ (98; 75 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్) గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ గురించి మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్లెడ్జింగ్‌కు పాల్పడిందని సెహ్వాగ్ తెలిపాడు. సచిన్‌ను షోయబ్ అక్తర్ బెదిరించాడని వీరూ పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తొలి ఓవర్లో 18 పరుగులు చేశాడు. షోయబ్ అక్తర్ తన మొదటి ఓవర్ బౌల్ చేశాడు. సచిన్ వికెట్ ప్రాముఖ్యత అతనికి బాగా తెలుసు. అందుకే సచిన్ దృష్టి మరల్చేందుకు స్లెడ్జింగ్‌కు దిగాడు. అక్తర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. షాహిద్ అఫ్రిది కూడా సచిన్‌పై దూషణలకు దిగాడు. వీరిద్దరే కాదు పాక్ జట్టు మొత్తం స్లెడ్జింగ్‌కు పాల్పడింది. అయినా కూడా సచిన్ దృష్టి ఏమాత్రం చెదిరిపోలేదు. అలానే వికెట్‌పై నిలబడ్డాడు. మా జట్టు విజయంలో సచిన్ పాత్ర ఎంతో ఉంది' అని అన్నాడు.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచకప్ 2003 లీగ్ మ్యాచులో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. సెంచూరియన్‌లో జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 273 రన్స్ చేసింది. సయీద్ అన్వర్ (101) సెంచరీ బాదాడు. పేస్‌కు సహకరించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉండడంతో పాక్ విజయం ఖాయమనుకున్నారు అంతా.
వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. సచిన్ పాక్ బౌలర్లపై శివతాండవం చేశాడు. 75 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. రెండు పరుగులతో సెంచరీ మిస్ అయినా.. ఈ ఇన్నింగ్స్ మాత్రం భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో అలాగే మిగిలిపోయింది. ఈ మ్యాచులో అక్తర్ బౌలింగ్‌లో సచిన్ కొట్టిన అప్పర్ కట్ సిక్సర్‌ను ఎవరూ మర్చిపోరు. రాహుల్ ద్రవిడ్ (44 నాటౌట్), యువరాజ్ సింగ్ (50 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు.
Also Read: 'చందమామ'లా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్.. తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం!
Also Read: Poonam Bajwa Bikini: బికినీలో పూనమ్ బజ్వా.. స్విమ్మింగ్ పూల్‌లోని అందాలు తట్టుకోవడం కష్టమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి